భారత జాతీయ పతాకంపై వాహనాలు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కేరళకు చెందినదని పలువురు సోషల్ మీడియా యూజర్లు చెబుతున్నారు.
ఒక ట్విట్టర్ బ్లూ వినియోగదారుడు ఈ వీడియో కేరళలో చోటు చేసుకుందని షేర్ చేస్తూ వచ్చారు. “కేరళకు సంబంధించిన ఈ వీడియోను చూడండి. దీన్ని ప్రపంచం మొత్తం ఫార్వర్డ్ చేయండి. 6 నెలల తర్వాత ఫార్వార్డ్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదు." అంటూ పోస్టులో తెలిపారు.
పలువురు ట్విట్టర్, ఫేస్ బుక్ వినియోగదారులు కూడా ఈ వీడియో కేరళలో చోటు చేసుకుందంటూ ప్రచారం చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
ఈ వీడియో పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో చోటు చేసుకుందని న్యూస్ మీటర్ బృందం గుర్తించింది.
మేము వీడియోలో కొందరు పాకిస్థాన్ జెండాను పట్టుకున్న వ్యక్తులను కనుగొన్నాము. దీన్ని బట్టి అది పాకిస్థాన్ కు చెందిన వీడియో అయి ఉండవచ్చని అనుకున్నాం. అందుకు సంబంధించి యూట్యూబ్‌లో కీవర్డ్ సెర్చ్ చేసాము. ఈ వీడియోను రియల్ ఇండియన్ అనే ఛానెల్ 6 జూన్ 2022న అప్లోడ్ చేసిందని కనుగొన్నాము. పాక్ ప్రజలు భారత జెండాపై వాహనాలను నడుపుతున్నారని క్యాప్షన్ పేర్కొంది.
వీడియోను నిశితంగా పరిశీలించగా.. వీడియోలోని షాపుల ముందు సనమ్ బొటిక్ బోర్డు ఉండడాన్ని గమనించాము. దీన్ని క్యూగా తీసుకుని, గూగుల్ మ్యాప్స్‌లో పాకిస్థాన్‌లోని సనమ్ బోటిక్ కోసం వెతికాము. కరాచీలో ఉన్న దుకాణాన్ని కనుగొన్నాము.
గూగుల్ స్ట్రీట్ వ్యూను ఉపయోగించి చూడగా.. వైరల్ వీడియోలోనూ, Google మ్యాప్స్‌లోని బోర్డ్ ఒకేలా ఉన్నాయని మేము నిర్ధారించగలము.
గూగుల్ మ్యాప్స్‌లో దుకాణానికి సమీపంలో ఉన్న భవనాలను కూడా మేము గుర్తించాము, అవే వైరల్ వీడియోలో కూడా ఉన్నాయి.
ఈ ఫలితాలను బట్టి, భారత త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిచిన వైరల్ వీడియో పాకిస్థాన్‌లోని కరాచీకి సంబంధించినదని.. భారతదేశంలోని కేరళకు సంబంధించినది కాదని మేము నిర్ధారించాము. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam