ఢిల్లీలో భారీగా వరదలు వచ్చిన సంగతి తెలిసిందే..! యమునా నది పోటెత్తడంతో భారీగా నీళ్లు జనావాసాల్లో వచ్చేశాయి. నివాస ప్రాంతంలోకి ఓ మొసలి వచ్చిన వీడియో చాలా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల సమయంలో ఢిల్లీలో ఈ మొసలి కనిపించిందని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు.
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీలో చాలా ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. హత్నికుండ్ బ్యారేజీ నుండి హర్యానా నదిలోకి ఎక్కువ నీటిని విడుదల చేయడంతో యమునా నది 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని దాటింది.
ఓ ట్విట్టర్ వినియోగదారుడు ఈ వీడియోను “Several districts of Delhi experienced floods and waterlogging as the Yamuna’s level rose. People sharing videos of the capital, one of them captures a crocodile that came along with gushing waters. (sic)” అంటూ పోస్టు చేశారు.
యమునా మట్టం పెరగడంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వరదలని ఎదుర్కొన్నాయని.. ఒక ప్రాంతంలో మొసలి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు.
నిజ నిర్ధారణ :
ఈ వీడియో 2022లో మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందినదని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఆగస్ట్ 14, 2022న ఒక యూజర్ ట్వీట్ చేసిన అదే వీడియోని చూశాం. ఆ వీడియో శివపురిలోనిది అని అతను క్యాప్షన్‌లో పేర్కొన్నాడు.
దీనిని క్యూగా తీసుకొని, మేము కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. వీడియో నుండి తీసుకున్న స్టిల్స్ కి సంబంధించిన ఫోటోలు ఉన్న కథనాన్ని ABP న్యూస్ ఆగస్టు 15, 2022 నివేదించింది. భారీ వర్షాల కారణంగా మధ్యప్రదేశ్‌లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. శివపురి ప్రాంతంలోకి వర్షపు నీటిలో మొసలి కనిపించింది.
NDTV, News18 కూడా ఇదే కథనాన్ని నివేదించాయి. ఆగస్టు 2022లో మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలోని నివాస ప్రాంతంలోకి మొసలి సంచరించిన సంఘటనను నివేదించాయి. ఆ నివేదికలు కూడా వీడియో నుండి స్టిల్స్‌ను కలిగి ఉన్నాయి.
అందువల్ల, వైరల్ వీడియో మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో 2022 లో చోటు చేసుకుందని మేము నిర్ధారించాము. ఆ వీడియో ఢిల్లీకి చెందినదన్న వాదన అవాస్తవం.
Credits : Md Mahfooz Alam