జనవరి 22న రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ముంబైలోని మీరారోడ్‌లోని నయా నగర్‌లో రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది.
శాంతిని కాపాడేందుకు, మీరా భయందర్ వసాయి విరార్ (MBVV) పోలీసులు సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్‌లకు కీలక సూచనలు చేశారు. ఎలాంటి జోకులు, వీడియోలు లేదా ఘర్షణలకు సంబంధించిన ఇతర కంటెంట్‌లు ఫార్వార్డ్ చేయకుండా చూసుకోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆర్డర్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పలు గ్రూప్ ల అడ్మిన్‌లను హెచ్చరించారు.
ముంబైలోని మీరా రోడ్ ఘటనకు సంబంధించి పోలీసులు చర్యలు తీసుకున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. #MiraRoadRiots అనే హ్యాష్‌ట్యాగ్‌తో వీడియోను షేర్ చేశారు. మీరా రోడ్ ఘర్షణలో పాల్గొన్న యువకులను పోలీసులు బయటకు లాగి.. అరెస్టు చేసినట్లు క్యాప్షన్ సూచిస్తుంది.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని న్యూస్‌మీటర్ గుర్తించింది. 2022లో హైదరాబాద్‌లోని శాలిబండ ప్రాంతంలోని జోహ్రా కాలనీకి చెందిన యువకులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వీడియో చూపిస్తుంది.
వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఒరిజినల్ వీడియోను ట్విట్టర్ లో కనుగొన్నాము. హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ యూనస్ లసానియా 24 ఆగస్టు 2022న ఈ వీడియోను పోస్ట్ చేసారు. మహ్మద్ ప్రవక్తపై.. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలకు నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆ సమయంలో నిరసనలు జరిగాయి. హైదరాబాద్ పోలీసులు ఇంటి నుండి నిరసనకారులను అరెస్టు చేశారని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఆగస్ట్ 25, 2022 న ది సియాసత్ డైలీ నివేదికను మేము గమనించాము. వైరల్ వీడియోకు సమానమైన విజువల్స్‌తో కూడిన స్క్రీన్‌గ్రాబ్‌ను గుర్తించాం. నివేదిక ప్రకారం, హైదరాబాద్ పోలీసులు బలవంతంగా ఇళ్లలోకి ప్రవేశించి, శాలిబండ, చుట్టుపక్కల అనేక మంది ముస్లిం యువకులను అరెస్టు చేశారు. ప్రవక్త మొహమ్మద్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
జియోలొకేషన్
ఇంకా, వీడియోను నిశితంగా పరిశీలించినప్పుడు వీడియో ప్రారంభంలో "SHAFFAF" అనే టెక్స్ట్ ఉన్న బోర్డుని మేము గమనించాము. కీలక పదాలను ఉపయోగించి అది హైదరాబాద్‌లో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సరఫరా చేసే దుకాణమని మేము కనుగొన్నాము. మేము Google మ్యాప్స్‌లో బోర్డు ఖచ్చితమైన స్థానాన్ని కనుగొన్నాము. ఇది హైదరాబాదులోని శాలిబండలోని బ్నజ్జ గలీ 2లో ఉంది.
"SHAFFAF" షాప్ యొక్క బోర్డ్‌ను చూపుతున్న వైరల్ వీడియో, Google స్ట్రీట్ వ్యూ కు సంబంధించిన స్క్రీన్‌గ్రాబ్‌లు ఇక్కడ చూడొచ్చు.
అందువల్ల, హైదరాబాద్ పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసిన పాత వీడియోను ముంబైలోని మీరా రోడ్ ఘటన తర్వాత పోలీసులు తీసుకున్న చర్య అని తప్పుగా ప్రచారం చేస్తున్నారని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam