మే 7న 2024 లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 11 రాష్ర్టాలు, యూటీల్లోని 93 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో దాదాపు 65 ఓటింగ్ శాతం నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మూడో విడత ఎన్నికల్లో భాగంగా అస్సాంలో అత్యధికంగా 81.71, ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 57.34 శాతం పోలింగ్ నమోదైంది. బీహార్, గుజరాత్‌లోనూ దాదాపు 58 శాతం, మహారాష్ట్రలో 61 శాతం మంది ఓటర్లు మాత్రమే ఓటేశారు.
బ్యానర్లు పట్టుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిరసనకారులు జీవితకాలంలో నిరుద్యోగులుగానే ఉంటారని చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియోను 2024 లోక్‌సభ ఎన్నికలకు లింక్ చేశారు.
“బ్యానర్‌ని తీసివేయండి, లేదంటే మీరు జీవితాంతం నిరుద్యోగులుగా ఉంటారు. అలాంటి వారిని అనుమతించకూడదు" అని యోగి చెబుతున్నట్లు వీడియోలో వినిపిస్తోంది. (ఆర్కైవ్)
"యోగి జీ వేదికపై నుండి విద్యార్థులను, యువతను బహిరంగంగా బెదిరిస్తున్నారు. బ్యానర్‌ను తొలగించండి లేకపోతే నేను మిమ్మల్ని శాశ్వతంగా నిరుద్యోగిని చేస్తాను'" అని వ్యాఖ్యలతో ఫేస్‌బుక్ వినియోగదారుడు వీడియోను షేర్ చేశారు.
“ఈ బ్యానర్‌ని తీసేయండి, లేదంటే మీరు ఎప్పటికీ నిరుద్యోగులుగానే ఉంటారని సీఎం యోగి అన్నారు. #LokSabhaElections2024,” అంటూ ఒక X వినియోగదారు వీడియోను పోస్టు చేశారు. దానిని ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు లింక్ చేశారు.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ ఈ వీడియో 2019 నాటిదని, 2024 లోక్‌సభ ఎన్నికలతో తప్పుగా లింక్ చేశారని కనుగొంది.
సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను అమలు చేశాం. ఏప్రిల్ 2019లో పలువురు X వినియోగదారులు పోస్ట్ చేసిన ఇదే వీడియోను మేము కనుగొన్నాము. ఒక వినియోగదారు ప్రకారం, BTC-శిక్షణ పొందిన వ్యక్తులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముందు నిరసనకు దిగారు.. ఆయన స్పందన ఇలా వచ్చింది అంటూ తెలిపారు. ఆగ్రాలో ఈ ఘటన చోటు చేసుకుందని పలువురు సోషల్ మీడియా యూజర్లు, మీడియా సంస్థలు కూడా తెలిపాయి.
ఫిబ్రవరి 19, 2020న ప్రచురించిన OneIndia హిందీ నివేదికలో కూడా మేము అదే వీడియోను కనుగొన్నాము. నివేదిక ప్రకారం.. CM ఆదిత్యనాథ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బ్యానర్‌ను తీసివేయమని ఒక వ్యక్తిని అడిగారు. తీసివేయకపోతే ఎప్పటికీ నిరుద్యోగిగానే ఉంటారని హెచ్చరించారు.
యూపీ సీఎం నిరసనకారులను హెచ్చరించారని పేర్కొంటూ, ఫిబ్రవరి 19, 2020న జనసత్తా మీడియా సంస్థ వీడియోను కూడా అప్లోడ్ చేసింది.
ఈ వీడియో 2019 నుండి ఇంటర్నెట్‌లో ఉందని మేము గుర్తించాం. 2024 లోక్‌సభ ఎన్నికలకు తప్పుగా ఆపాదించారని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam