నిజమెంత: ఢిల్లీలో కారులో మంటలు వచ్చిన ఘటనలో రా అధికారి చనిపోయారా?

రద్దీగా ఉండే రోడ్డుపై కారులో మంటలు చెలరేగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Jun 2024 2:00 PM IST
fact check, car video, fire,  delhi,

నిజమెంత: ఢిల్లీలో కారులో మంటలు వచ్చిన ఘటనలో రా అధికారి చనిపోయారా? 

రద్దీగా ఉండే రోడ్డుపై కారులో మంటలు చెలరేగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధికారి వికాష్ సెంథియాను గుర్తు తెలియని దుండగులు చంపేశారంటూ ప్రచారం చేస్తున్నారు. ఆయన వెళుతున్న కారులోకి హ్యాండ్ గ్రెనేడ్ విసిరి చంపినట్లు వీడియోను షేర్ చేస్తున్న వారు పేర్కొన్నారు.

కెనడాలో సిక్కు హత్యలో సెంథియా ప్రమేయం ఉందని వైరల్ పోస్టుల్లో ఆరోపించారు.

Pakistan First అనే ఎక్స్ హ్యాండిల్ వీడియోను షేర్ చేసింది. “Uttam Nagar, New Delhi Indian intelligence officer Vikash killed by unknown men when they lobbed a hand grenade in his car.” అంటూ పోస్టు పెట్టింది. న్యూ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వికాస్ ను చంపేశారంటూ ప్రచారం చేశారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

కారు వేడెక్కడం వల్ల మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదానికి.. వికాష్ సెంథియాకు ఎలాంటి సంబంధం లేదని న్యూస్‌మీటర్ కనుగొంది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని స్పష్టంగా కనుగొన్నాం.

వీడియో కు సంబంధించిన కీఫ్రేమ్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించాం. మే 14న వార్తా సంస్థ IANS, ఇండియా డైలీ లైవ్ కు సంబంధించిన X హ్యాండిల్స్ లో ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో ఈ సంఘటన జరిగినట్లు నివేదికలు వచ్చాయి. ఆకస్మిక అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని మీడియా సంస్థలు తెలిపాయి.

మరింత ధృవీకరణ కోసం, మేము ఉత్తమ్ నగర్ SHO రాజేష్ కుమార్‌ను సంప్రదించాము. ఇంటెలిజెన్స్ అధికారిపై దాడికి సంబంధించిన వీడియో అంటూ జరుగుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము ధృవీకరించారు. "అధిక వేడి కారణంగా రోడ్డుపై వెళుతున్న కారు అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారు నడుపుతున్న వ్యక్తి సమయానికి కారు దిగి తనను తాను రక్షించుకున్నాడు." అని రాజేష్ కుమార్ వివరించారు.

కెనడాలో జరిగిన హత్యకు సంబంధించిన వివరాలు:

మేము కెనడాలో ఒక సిక్కు వ్యక్తి హత్య గురించి తనిఖీ చేసాము. మే 12 నాటి ది ఎకనామిక్స్ టైమ్స్ నుండి ఒక నివేదికను చూశాము. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (IHIT) కరణ్ బ్రార్‌ (22), కమల్‌ప్రీత్ సింగ్ (22), కరణ్‌ప్రీత్ సింగ్ (28), అమర్‌దీప్ సింగ్ (22) లను అరెస్టు చేసింది. కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి ఈ అరెస్టులు జరిగాయి.

వికాష్ సెంథియా 2023 బ్యాచ్‌కి చెందిన IPS అధికారి అని కూడా మేము కనుగొన్నాము. ఆయన లింక్డ్‌ఇన్, ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ల ప్రకారం.. ప్రస్తుతం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ - భారతదేశ పౌర సేవా శిక్షణా సంస్థలో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు,

RAW అధికారిని ఢిల్లీ నడిరోడ్డుపై హత్య చేశారంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాము.

Claim Review:నిజమెంత: ఢిల్లీలో కారులో మంటలు వచ్చిన ఘటనలో రా అధికారి చనిపోయారా?
Claimed By:X users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story