మణిపూర్‌లో కొనసాగుతున్న హింసకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మహిళలను హింసిస్తున్న ఎన్నో వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. రాజకీయ, సామాజిక అశాంతితో ఉంది మణిపూర్. ఒక యువతిపై మిలిటెంట్ల బృందం దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. మిలిటెంట్ల బృందం దాడి చేస్తున్న ఈ వీడియో హృదయాన్ని కదిలించే విధంగా ఉంది. ఈ వీడియోను (trigger warning: viewer discretion advised) అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేశారు.
వైరల్ వీడియోలో, యూనిఫాం ధరించిన పురుషుల గుంపు ఒక యువతిని కనికరం లేకుండా ఆమె ముఖంపై తన్నడం, కొట్టడం మనం చూడొచ్చు. దారుణంగా కొట్టిన తర్వాత.. వీడియో చివర్లో, వారు ఆమెను కాల్చి చంపారు.
BBC ప్రకారం, మణిపూర్ లో అశాంతి నెలకొంది. రాష్ట్రంలోని రెండు అతిపెద్ద సమూహాలు, మెజారిటీ మెయిటీ, మైనారిటీ కుకీ మధ్య గొడవలు భారీగా ఉన్నాయి.
మేలో ఇద్దరు కుకీ మహిళలపై మీటీ పురుషులు బహిరంగంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఒక వీడియో బయటకు వచ్చింది. పలు గ్రామాలను ధ్వంసం చేసిన అనేక వైరల్ వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. మణిపూర్ లో చోటు చేసుకున్న వీడియోలు అంటూ ఎంతో మంది పలు వీడియోలను షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
ఈ వీడియో మయన్మార్‌లోని టముకు చెందినదని మేము గుర్తించాము. కాబట్టి వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదని NewMeter కనుగొంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడంతో పాటూ.. మేము Yandex (ఒక శోధన ఇంజిన్)లో వీడియోను కనుగొన్నాము. ఈ సంఘటనపై నివేదిక డిసెంబర్ 6, 2022న క్లిక్ ఫర్ పిడిఎఫ్‌లో ప్రచురించారు. ఇది టములోని పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (పిడిఎఫ్) బృందం చేతిలో దారుణంగా గాయపడ్డాక.. చంపిన ఒక మహిళకు సంబంధించిన వీడియో అని అందులో పేర్కొన్నారు.
"టములో ఒక మహిళను కాల్చి చంపిన సంఘటన సైనిక ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించినందుకు NUG పేర్కొంది" అని నివేదికలో ఉంది.
అదే రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ‘మయన్మార్‌లో హెచ్చరిక- క్రూరమైన శిక్ష’ శీర్షికతో Rec Livegore అనే వెబ్ సైట్ లో (trigger warning: viewer discretion advised) వీడియోను అప్లోడ్ చేశారు.
దీని నుండి క్యూ తీసుకొని, మేము కీవర్డ్ సెర్చ్ చేసాము. అదే నివేదికను డిసెంబర్ 6, 2022న ప్రచురించిన విశ్వసనీయ మీడియా వెబ్‌సైట్ మయన్మార్ నౌలో కనుగొన్నాము.
అందువల్ల, మయన్మార్‌లోని టము లో దాదాపు ఒక సంవత్సరం క్రితం నాటి వీడియో మణిపూర్‌లో అశాంతిగా ప్రచారం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది.
Credits : Sunanda Naik