FactCheck : మణిపూర్ లో చోటు చేసుకున్న దారుణ ఘటనలపై అక్షయ్ కుమార్ వీడియోను పోస్టు చేశారా?

Video of Akshay Kumar falsely linked to assault on kuki women in manipur. మణిపూర్ లో మహిళల పట్ల చోటు చేసుకున్న అకృత్యాలకు వ్యతిరేకంగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన గళం వినిపించారంటూ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 July 2023 12:31 PM GMT
FactCheck : మణిపూర్ లో చోటు చేసుకున్న దారుణ ఘటనలపై అక్షయ్ కుమార్ వీడియోను పోస్టు చేశారా?

మణిపూర్ లో మహిళల పట్ల చోటు చేసుకున్న అకృత్యాలకు వ్యతిరేకంగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన గళం వినిపించారంటూ ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. మణిపూర్‌లో కుకీ మహిళలపై ఇటీవల చోటు చేసుకున్న లైంగిక వేధింపుల ఘటనకు సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను లింక్ చేశారు.



“Akshay Kumar on #Manipur viral video on our 2Kuki sisters.” అంటూ ఫేస్ బుక్ లో వీడియోను షేర్ చేశారు. పలువురు నెటిజన్లు కూడా ఇదే తరహాలో వీడియోలను పోస్టు చేశారు.

నిజ నిర్ధారణ :

న్యూస్ మీటర్ బృందం వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదని కనుగొంది.

మేము ఇందుకు సంబంధించి కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. జనవరి 5, 2017 న NDTV కథనాన్ని చూశాము, “బెంగళూరులో మహిళల వేధింపులపై అక్షయ్ కుమార్ వీడియో వైరల్ అయ్యింది.” అని అందులో చెప్పుకొచ్చారు. 2017 న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరులో మహిళలపై జరిగిన వేధింపులపై అక్షయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియోను పోస్ట్ చేశారు.

జనవరి 5, 2017న అక్షయ్ కుమార్ ట్వీట్ చేసిన వీడియోను కూడా నివేదిక అందించింది. “The Bangalore incident makes me feel we r evolving backwards, from humans to animals, rather beasts coz even animals are better! Truly shameful. (sic)” అంటూ వీడియోను పోస్టు చేశారు అక్షయ్ కుమార్.

వైరల్ క్లిప్ ఈ వీడియోలో 0.36-సెకన్ల టైమ్ మార్క్‌లో కనిపిస్తుంది. “నేను ఈ రోజు మనిషిని అయినందుకు సిగ్గుపడుతున్నాను. బెంగుళూరులో జరిగిన వేధింపుల సంఘటన గురించి తెలుసుకున్న సమయంలో నేను నా నాలుగు సంవత్సరాల కుమార్తెను నా చేతుల్లో ఉంచుకుని నా న్యూ ఇయర్ హాలిడేస్ నుండి తిరిగి వస్తున్నాను. మీరందరూ దాని గురించి ఎలా అనుకుంటున్నారో తెలియదు, కానీ నాకు మాత్రం రక్తం ఉడికిపోతోంది." అని అన్నారు.

మగవారి కంటే తమను తాము తక్కువగా మహిళలు భావించవద్దని, ఆత్మరక్షణకు సంబంధించి పలు విషయాలను నేర్చుకోవాలని మహిళలకు సూచించారు.

మణిపూర్‌లో దాడికి సంబంధించిన వీడియోపై కూడా అక్షయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. జూలై 20న, అక్షయ్ కుమార్ ట్విటర్‌లో “మణిపూర్‌లో మహిళలపై హింసకు సంబంధించిన వీడియో చూసి విస్తుపోయాను. ఇకపై ఇలాంటి పని చేయాలంటే భయపడేలా.. దోషులకు కఠిన శిక్ష పడుతుందని నేను ఆశిస్తున్నాను" అని అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చారు.

అక్షయ్ కుమార్ కు సంబంధించిన వైరల్ వీడియో 2017 నాటిదని.. మణిపూర్‌లో జరిగిన ఘటనకు తప్పుగా లింక్ చేశారని మేము నిర్ధారించాము.

Credits : Md Mahfooz Alam



Claim Review:మణిపూర్ లో చోటు చేసుకున్న దారుణ ఘటనలపై అక్షయ్ కుమార్ వీడియోను పోస్టు చేశారా?
Claimed By:Social media users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story