Veteran Tollywood Actress Urvasi Saradha is Not Dead do Not Believe Viral Claim. టాలీవుడ్ వెటరన్ నటి శారద చనిపోయారంటూ ఇటీవల
By Medi Samrat Published on 10 Aug 2021 9:30 AM GMT
టాలీవుడ్ వెటరన్ నటి శారద చనిపోయారంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్టులను పెట్టారు. ఫేస్ బుక్, వాట్సాప్ లలో ఆమె చనిపోయారని కొందరు పోస్టులు పెట్టారు. అది నిజమేనని నమ్మిన కొందరు ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ పోస్టులను చేశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
శారదా మరణించారంటూ వైరల్ అవుతున్న పోస్టుల గురించి పలువురు మీడియా సంస్థలకు సంబంధించిన వ్యక్తులు ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించారు. అందులో ఎటువంటి నిజం లేదని.. ఆమె బ్రతికే ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు.
తిరుపతికి చెందిన ఫోటో జర్నలిస్ట్ ఆమెతో మాట్లాడారు. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. శారద చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పుకొచ్చారు. పనీ పాటా లేని వాళ్లు ఇలా చనిపోయానని చేసిన పోస్టులలో ఎటువంటి నిజం లేదని.. తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. తాను చనిపోయానని చెప్పడం వలన ఎంతో మంది బాధ పడ్డారని ఆమె ఫోన్ కాల్ లో చెప్పుకొచ్చారు. దయచేసి ఇలాంటి పోస్టులను పెట్టి ఇతరులను బాధపెట్టకూడదని ఆమె అన్నారు.
మీరు కూడా ఆ ఆడియో ఫైల్ ను వినొచ్చు.
ఆమె చనిపోయారనే వార్తలను ఖండిస్తూ పలు మీడియా సంస్థలు పోస్టు చేశాయి.