ఫిబ్రవరి 4న తెల్లవారుజామున 2 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వందేభారత్ రైలు ప్రమాదానికి గురైందనే వాదనతో పోస్టులు వైరల్ చేస్తున్నారు. ఓ రైలు మరొక రైలు పైకి దూసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు ఇదే వాదనతో వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. వీడియోలోని రైలు ప్రమాదం చిలీకి చెందినది.
కీవర్డ్ సెర్చ్ చేయగా.. గోరఖ్‌పూర్ నుండి అయోధ్య, లక్నో మీదుగా ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌కు వెళుతున్న వందే భారత్ రైలు ఉదయం సమయంలో ఓ ఎద్దును ఢీకొట్టిందని, ఫిబ్రవరి 5న ప్రచురించిన అమర్ ఉజాలా నివేదిక మాకు కనిపించింది. ఈ నివేదిక ప్రకారం మనుషులెవరూ మరణించలేదని, అలాగే మరొక రైలును ఢీకొట్టింది. వైరల్ వీడియోను మీడియా నివేదికలో ప్రస్తావించలేదు. అలాగే ప్రమాదానికి గురైన రైలు డిజైన్ వందే భారత్ రైలులా కనిపించడం లేదు.
వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. జూన్ 20, 2024న అసోసియేటెడ్ ప్రెస్ ప్రచురించిన అదే విజువల్స్‌తో కూడిన నిడివి ఎక్కువ ఉన్న వీడియోను మేము కనుగొన్నాము, ‘Chile train collision kills at least 2 people, injures several others.’ అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు. చిలీలో రైలు ఢీకొనడం వల్ల ఇద్దరు మరణించారు.. అనేక మంది గాయపడ్డారని కథనంలో ఉంది.
వార్తా సంస్థ ప్రకారం.. చిలీ రాజధాని శాంటియాగో వెలుపల టెస్ట్ రన్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. తొమ్మిది మంది గాయపడ్డారు.
రెండు వీడియోల మధ్య పోలిక ఇక్కడ ఉంది.
జూన్ 20, 2024న 'చిలీలో రైలు ఢీకొనడంతో కనీసం 2 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు' అనే శీర్షికతో 'ది హిందూ' ప్రచురించిన నివేదికలో అవే విజువల్స్ ఉన్న చిత్రాన్ని కూడా మేము కనుగొన్నాము.
చిలీ రాజధాని శాంటియాగో వెలుపల టెస్ట్ రన్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని నివేదిక పేర్కొంది.
అందువల్ల, లక్నోలో వందే భారత్ రైలు ప్రమాదాన్ని వీడియో చూపించలేదని మేము నిర్ధారించాము.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam