Fact Check : V6 ఛానల్ జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఒపీనియన్ పోల్ ను నిర్వహించిందా..?

V6 Velugu did not conduct any opinion poll. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతూ ఉంది. డిసెంబర్ 1, 2020న ఎన్నికలు

By Medi Samrat  Published on  28 Nov 2020 5:18 PM GMT
Fact Check : V6 ఛానల్ జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఒపీనియన్ పోల్ ను నిర్వహించిందా..?

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతూ ఉంది. డిసెంబర్ 1, 2020న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇలాంటి సమయంలో ఓ జీఎఫ్ఎక్స్ ఇమేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. V6 తెలుగు ఛానల్ జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఒపీనియన్ పోల్ ను నిర్వహించినట్లుగా ఆ ఫోటోలో ఉంది.



హైదరాబాద్ లోని ఒక్కో డివిజన్ లో 1000 మందిని కలిసి ఈ సర్వే నిర్వహించినట్లుగా ఆ ఫోటో మీద ఉంది. ఈ సర్వే రిజల్ట్స్ లో టీఆర్ఎస్ 92-101 సీట్లు, భారతీయ జనతా పార్టీకి 10-12 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 2-4 సీట్లు వస్తాయని.. ఎంఐఎం 39-44 సీట్లు కైవసం చేసుకుంటుందని అంటున్నారు. ఇతరులకు 2-5 సీట్లు దాకా రావచ్చని అంచనా వేస్తున్నట్లు ఈ ఫోటో ద్వారా తెలిపారు.

నిజ నిర్ధారణ:

V6 తెలుగు ఛానల్ సర్వే నిర్వహించినట్లుగా వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. వైరల్ అవుతున్న ఫోటో ఫేక్ అని వి6 వార్తా సంస్థ స్పష్టం చేసింది.

"సోషల్ మీడియాలో కావాలని కొందరు V6 పేరుతో GHMC ఎన్నికలపై ఫేక్ సర్వే ట్రోల్ చేస్తున్నారు నమ్మకండి. #V6Velugu #V6News #Hyderabad #GHMCElections2020" అంటూ V6 సంస్థ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టింది.


సోషల్ మీడియాలో కావాలని కొందరు V6 పేరుతో GHMC ఎన్నికలపై ఫేక్ సర్వే ట్రోల్ చేస్తున్నారు నమ్మకండి. #V6Velugu #V6News #Hyderabad #GHMCElections2020

Posted by V6 News on Friday, 27 November 2020


కొందరు తప్పుడు ఎలెక్షన్ సర్వే సమాచారాన్ని వి6 మీడియా సంస్థ పేరుతో ప్రచారం చేస్తున్నారని వి6 సంస్థ తమ అధికారిక సామాజిక మీడియా ఖాతాల్లో తెలిపింది. వీటిని ఎవరూ నమ్మకూడదని స్పష్టం చేసింది.

వైరల్ అవుతున్న ఫోటో మార్ఫింగ్ అని స్పష్టంగా తెలుస్తోంది.

గత కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో కొన్ని సర్వేలకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. చాణక్య సంస్థ చేసిన సర్వే అంటూ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఈ సర్వేలో భారతీయ జనతా పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేస్తుందని చెబుతూ ఉంది. ఇంకొక సర్వేలో టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలుస్తూ ఉన్నాయి. ఈ సర్వేకు సంబంధించిన అధికారిక ప్రకటనలు ఏ సంస్థలు చేయడం లేదు. ఈ వైరల్ పోస్టు మీద పోలీసులను ఆశ్రయించడం కూడా జరిగింది.

V6 సంస్థ సర్వే చేయించినట్లుగా వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.




Next Story