అమెరికా అధ్యక్షుడు బిడెన్ ప్రసంగం చేస్తున్న సమయంలో ఒక పిల్లి వచ్చిందని.. బిడెన్ ఆ పిల్లిపై కాలు మోపినట్లు చూపించే వీడియోను చాలా మంది X వినియోగదారులు షేర్ చేశారు.
వైరల్ వీడియోలో బిడెన్ నడుస్తున్నప్పుడు తడబడుతున్నట్లు చూపిస్తుంది, దాని తర్వాత పిల్లి అరుస్తున్న శబ్దం వినిపించింది. బిడెన్ “Whoops, stepping on him. But it’s black. Anyway—.” అంటూ చెప్పడం వినవచ్చు.
ప్రెసిడెంట్ బిడెన్ ప్రసంగం చేస్తున్న సమయంలో అక్కడ పిల్లి ఏమి చేస్తుందో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకూ ఈ వీడియో నిజమో.. కాదో తెలుసుకుందాం.
నిజ నిర్ధారణ :
ఒరిజినల్ వీడియోలో పిల్లి లేదని న్యూస్‌మీటర్ కనుగొంది. వైరల్ వీడియో ఎడిట్ చేశారని గుర్తించాం.
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం ద్వారా మా పరిశోధనను ప్రారంభించాము. న్యూయార్క్ పోస్ట్‌లో నవంబర్ 6, 2022న ప్రచురించబడిన మీడియా నివేదికను కనుగొన్నాము. “Biden says ‘no more drilling’, stumbles on stage in a last-ditch effort to save Kathey Hochul from surging Lee Zeldin.” అంటూ అందులో చెప్పుకొచ్చారు.
నిడివి ఎక్కువగా ఉన్న వీడియోలో.. బిడెన్ నడుస్తున్నప్పుడు తడబడలేదని.. వేదికపై ఏ పిల్లి లేదని.. ఎలాంటి అరుపులు మేము వినలేకపోయాము.
దీన్ని ఒక క్యూగా తీసుకొని, మేము డైలీ మెయిల్ అధికారిక YouTube ఛానెల్‌లో వైరల్ వీడియోకు చూసాం. వీడియోలో, బిడెన్ “stepping on them...oh ...it’s black… anyways,” అని చెప్పడం స్పష్టంగా వినిపించింది. ఆ తర్వాత ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఆ తర్వాత కూడా.. జో బిడెన్ ప్రసంగానికి సంబంధించిన అసలు వీడియోలో ఎక్కడా పిల్లి అరుపు వినబడలేదు. వైరల్ వీడియోను ఎడిట్ చేశారని మేము నిర్ధారించాం.
Credits : Sunanda Naik