100 డాలర్ల అమెరికన్ కరెన్సీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఆ అమెరికన్ కరెన్సీలో శివాజీ మహారాజ్ బొమ్మ ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఫిబ్రవరి 19 ని 'ప్రపంచ ఛత్రపతి దినోత్సవంగా' నిర్వహించబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.
'భారతీయులు ఎంతో గర్వించదగిన వార్త ఇది.. అమెరికాలో ఫిబ్రవరి 19 ని 'ప్రపంచ ఛత్రపతి దినోత్సవంగా' నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ఆ రోజు శివాజీ పుట్టినరోజు. అమెరికా ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ విషయాన్ని అందరికీ చేరవేయండి. భారత్ కు దక్కిన అరుదైన గౌరవం ఇది.' అని వైరల్ అవుతున్న పోస్టులో ఉంది.
ఇలాంటి పోస్టులే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. 'ప్రపంచ ఛత్రపతి దినోత్సవంగా' ఫిబ్రవరి 19ని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది అంటూ వైరల్ అవుతున్న పోస్టులు నిజం కావు.
న్యూస్ మీటర్ ఈ వార్తకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం కోసం సెర్చ్ చేయగా.. ఒక్క మీడియా సంస్థ కూడా ఇందుకు సంబంధించిన కథనాన్ని ప్రచురించలేదు. అమెరికాలో అధికారిక దినోత్సవాలకు సంబంధించిన సమాచారాన్ని, సెలవులను కూడా పరిశీలించగా.. ప్రపంచ ఛత్రపతి దినోత్సవంకు సంబంధించిన ఎటువంటి కూడా కనిపించలేదు.
Hindustan Times కథనం ప్రకారం ఛత్రపతి దినోత్సవాన్ని మహారాష్ట్రలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 19న నిర్వహిస్తారు. 'శివాజీ జయంతిని మహారాష్ట్రలో నిర్వహిస్తారు. మహారాష్ట్రలో ఆరోజున పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
అమెరికా ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం 100 డాలర్ల నోటు మీద 1914 తర్వాతా కేవలం నాలుగు సార్లు మాత్రమే మార్పులు చేశారు. 2013 తర్వాత ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ వైరల్ ఫోటోలో ఉన్నది ఫోటో షాప్ చేసినది మాత్రమే. గతంలో కూడా శివాజీ బొమ్మ ఉన్న ఫేక్ నోట్ విషయంలో న్యూస్ మీటర్ నిజ నిర్ధారణ చేసింది.
https://newsmeter.in/fact-check-claim-that-new-200rs-notes-will-be-printed-with-sivaji-maharajs-picture-is-false/
'ప్రపంచ ఛత్రపతి దినోత్సవంగా' ఫిబ్రవరి 19ని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది అంటూ వైరల్ అవుతున్న పోస్టులు నిజం కావు. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.