Fact Check : అవి భారత్ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఫోటోలేనా..!

US Air Force Rescue Operation Passed Off as IAF Evacuation In Kabul. ఆఫ్ఘనిస్తాన్ లో ఇరుక్కున్న భారతీయులను తీసుకుని రావడానికి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Aug 2021 3:06 AM GMT
Fact Check : అవి భారత్ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఫోటోలేనా..!

ఆఫ్ఘనిస్తాన్ లో ఇరుక్కున్న భారతీయులను తీసుకుని రావడానికి భారత ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలను చేస్తూ ఉంది. ఇప్పటికే కొంత మందిని భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్ కు తీసుకుని వచ్చేసింది. ఇంకా మిగిలిన వాళ్లను కూడా తీసుకుని రావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది.

ఇక భారత ప్రభుత్వం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లు అంటూ కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో ఓ విమానంలో పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఉన్న ఫోటో వైరల్ అవుతూ ఉంది.

जिन्हें नहीं समझ आ रहा वो जान लें यह भारतीय वायुसेना के C-17 ग्लोब मास्टर जहाज के अंदर का दृश्य है। C-17 ग्लोब मास्टर जिसमें 800 लोगों को एक साथ काबुल से एयरलिफ्ट किया गया है.... सम्भवतः एक नया रिकॉर्ड होगा। मोदी है तो मुमकिन है) అంటూ పోస్టు వైరల్ అవుతూ ఉంది.


'ఈ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సి -17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ యొక్క లోపలి భాగాన్ని చూపుతుందని తప్పక తెలుసుకోవాలి. C-17 గ్లోబ్‌మాస్టర్ కాబూల్ నుండి 800 మందిని విమానంలో తీసుకుని వచ్చారు. బహుశా, ఇది కొత్త రికార్డు. మోడీ ఉంటే ఏదైనా సాధ్యమే' అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.

https://www.facebook.com/groups/801938403875313/permalink/1044698539599297/

https://www.facebook.com/groups/801938403875313/permalink/1044698539599297/

https://www.facebook.com/groups/801938403875313/permalink/1044698539599297/

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఈ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

న్యూస్ మీటర్ కీవర్డ్ సెర్చ్ చేసింది. ఇది భారత దేశానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన ఫోటోలు కావని తెలుస్తోంది. ఫిలిప్పీన్స్‌లో 2013 నవంబర్‌లో దేశాన్ని తుపాన్ తాకిన తర్వాత యుఎస్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన తరలింపు ఆపరేషన్‌ను సంబంధించిన ఫోటో ఇది. ఇదే ఫోటో ఏప్రిల్ 2014 లో ఎయిర్ ఫోర్స్ మ్యాగజైన్ ఎడిషన్‌లో ప్రచురించబడింది : "టాక్లోబన్ నుండి 670 మంది శరణార్థులు మనీలాకు తరలింపు సమయంలో C-17 నిండిపోయింది. విమానం, దాని సిబ్బంది హవాయిలోని JB పెర్ల్ హార్బర్-హికాం నుండి ఆపరేషన్ దమాయన్ కోసం మోహరించారు." అని ఉండడాన్ని గమనించవచ్చు.

రెండవది US ఎయిర్ ఫోర్స్ వెబ్‌సైట్‌లో ఫోటోను కనుగొన్నాము. శీర్షిక సారాంశం ఇలా ఉంది: "నవంబర్ 17, 2013 న ఫిలిప్పీన్స్‌ను తాకిన సూపర్ టైఫూన్ హయాన్ తరువాత మనీలాకు తరలించబడటానికి ముందు 670 కంటే ఎక్కువ టాక్లోబన్ నివాసితులు C-17 గ్లోబ్‌మాస్టర్ III లో కూర్చున్నారు. మానవతా సహాయం మరియు విపత్తు సహాయక చర్యలకు మద్దతుగా ఈ ఆపరేషన్ ను నిర్వహించారు. ప్రయాణీకులను సురక్షితం తరలించారు." అన్నది ఉంది.

https://www.af.mil/News/Article-Display/Article/467793/c-17-crew-members-reflect-on-philippine-relief-efforts/

ఆగస్టు 16, 2021 న డైలీ మెయిల్ లో వచ్చిన ఓ కథనంలో కూడా ఈ ఫోటోను వినియోగించారు. 2013 లో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ గురించి వివరించారు. "In 2013, the US Air Force put 670 people on a C-17 to rescue them from a typhoon in the Philippines. 800 - the number reported to have been flown out of Kabul on Sunday - sets a new record."

"2013 లో, US వైమానిక దళం 670 మందిని ఫిలిప్పీన్స్‌లో తుపాన్ నుండి రక్షించడానికి C -17 లో ఉపయోగించింది. ఆదివారం 800 మందిని కాబూల్ నుండి బయటకు తీసుకుని వెళ్లినట్లు నివేదించబడినది - కొత్త రికార్డును సృష్టించింది" అన్నది తాజా కథనంలో ఉంది.

నివేదికల ప్రకారం 2013లో ఒక శక్తివంతమైన తుఫాను మధ్య ఫిలిప్పీన్స్‌ను తాకింది. ఆ సమయంలో 10,000 మంది మరణించారు 600,000 మందికి పైగా నిర్వాసితులయ్యారు.

https://www.reuters.com/article/us-philippines-typhoon-idUSBRE9A603Q20131110

కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. భారత్ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లకు సంబంధించిన ఫోటోలు ఇవి కావు.
Claim Review:అవి భారత్ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఫోటోలేనా..!
Claim Fact Check:False
Next Story
Share it