Fact Check : డైనోసార్ ను ఇండోనేషియాలో సజీవంగా పెట్టుకున్నారా..?

Triceratops was not caught alive in Indonesia. డైనోసార్లు అంతమైపోయాయి. వాటి అవశేషాలు మాత్రమే చాలా ప్రాంతాల్లో దొరుకుతూ

By Medi Samrat  Published on  21 Dec 2020 4:26 AM GMT
Fact Check : డైనోసార్ ను ఇండోనేషియాలో సజీవంగా పెట్టుకున్నారా..?

డైనోసార్లు అంతమైపోయాయి. వాటి అవశేషాలు మాత్రమే చాలా ప్రాంతాల్లో దొరుకుతూ ఉన్నాయి. తాజాగా కొందరు వ్యక్తులు బ్రతికే ఉన్న ట్రిసెరాటాప్స్ జాతికి చెందిన డైనోసార్ ను పట్టుకున్నట్లుగా వీడియో వైరల్ అవుతూ ఉంది. ఇండోనేషియాలో ఈ జంతువును పట్టుకున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.



ఇండోనేషియా లోని తూర్పు జావా లోని మగేటన్ లో బ్రతికున్న ట్రిసెరాటాప్స్ డైనోసార్ ను పట్టుకున్నారంటూ వీడియోను పోస్టు చేశారు. అందులో కొందరు వ్యక్తులు తాళ్లతో ఆ జంతువును లాగుతూ ఉండడాన్ని గమనించవచ్చు. ఓ వాహనం నుండి ట్రిసెరాటాప్స్ ను కిందకు లాగుతూ ఉండడాన్ని గమనించవచ్చు.



ఇంకొందరు ట్రిసెరాటాప్స్ ను బ్రెజిల్ లో పట్టుకున్నారని పోస్టులు పెట్టారు. వర్షారణ్య ప్రాంతాల్లో ఈ జీవి కనిపించిందంటూ పోస్టులు పెట్టారు. "BREAKING: Brazilian authorities have captured a live triceratops that was discovered while clearcutting the rainforest." అంటూ పోస్టు పెట్టారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నవి 'నిజమైన డైనోసార్లు కావు'.

న్యూస్ మీటర్ ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఇదే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పలు మార్లు పోస్టు చేశారు. ఈ వీడియో బ్రెజిల్ కు చెందినది కాదు. ఇండోనేషియాలోని మోజోసెమి ఫారెస్ట్ పార్క్ కు చెందినది.



ఈ సమాచారం ప్రకారం మోజోసెమి ఫారెస్ట్ పార్క్ కు చెందిన వివరాల కోసం వెతకగా.. ఈ పార్క్ కు చెందిన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లభించింది.

అది ఒక డైనోసార్ పార్క్.. అలాగని నిజమైన డైనోసార్లు ఉండవు. వాటి రెప్లికాలు (అచ్చం నిజమైన డైనోసార్లను పోలినట్లుగా) ఉంటాయి. వివిధరకాల డైనోసార్ జాతులకు చెందినవి ఉంటాయి. అక్కడ మొత్తం 20 రకాల డైనోసార్లకు చెందిన రెప్లికాలు ఉన్నాయి. టూరిస్ట్ అట్రాక్షన్ కోసం ప్రత్యేకంగా డైనోసార్ల రెప్లికాలను ఏర్పాటు చేశారు. టూరిస్టులు కాస్త వైవిధ్యం కలిగిందని ఈ పార్క్ కు వస్తూ ఉంటారు.

https://bekasi.pikiran-rakyat.com/nasional/pr-121110279/heboh-viral-diduga-hewan-dinosaurus-triceratops-tiba-di-mojosemi-forest-park-magetan

వైరల్ అవుతున్న వీడియోను డిసెంబర్ 14, 2020న పోస్టు చేశారు. సి.ఎన్.ఎన్. ఇండోనేషియా కూడా ఈ వీడియో టూరిస్టులను ఆకర్షించడానికి అప్లోడ్ చేసినట్లు ధృవీకరించింది.

https://bacapaja.com/sedang-viral-video-dinosaurus-hidup-diturunkan-dari-truk-cek-faktanya-disini/



డైనోసార్ ను ఇండోనేషియాలో సజీవంగా పెట్టుకున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. ఆ వీడియోలో ఉన్నది నిజమైన డైనోసార్ కానేకాదు. ఇండోనేషియాలోని మోజోసెమి ఫారెస్ట్ పార్క్ కు చెందినది.




Claim Review:డైనోసార్ ను ఇండోనేషియాలో సజీవంగా పెట్టుకున్నారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story