ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో అడాల్ఫ్ హిట్లర్ ముఖాన్ని పాక్షికంగా పోల్చి చూపిస్తూ వచ్చిన టైమ్ మేగజైన్ కవర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మోదీ ప్రభుత్వ పాలనను జర్మనీ హిట్లర్ పాలనతో నెటిజన్లు పోలుస్తున్నారు. మ్యాగజైన్ కవర్‌పై 'ది రిటర్న్ ఆఫ్ హిస్టరీ. మోదీ భారత కలలను ఎలా బద్దలు కొట్టారు'( "The return of history. How Modi shattered India's Dreams.") అని రాసి ఉంది.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం TIME మ్యాగజైన్ యొక్క ఆర్కైవ్ విభాగం 'ది వాల్ట్'లో శోధించింది. 2020, 2021, 2022 సంవత్సరాలకు సంబంధించి అలాంటి కవర్ పేజీ ఏదీ కనుగొనబడలేదు. వైరల్ చిత్రంలో టైమ్, మ్యాగజైన్ కవర్‌లలోని టెంప్లేట్, ఫార్మాటింగ్ ఇతర వాటితో సరిపోలడం లేదని మేము గమనించాము.
https://time.com/vault/year/2020/
https://time.com/vault/year/2021/
https://time.com/vault/year/2022/
వెల్ష్ డిజైనర్ పాట్రిక్ ముల్డర్, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముఖంపై అడాల్ఫ్ హిట్లర్ ముఖాన్ని చూపించే మాక్ ఆర్ట్‌వర్క్‌ను పంచుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తున్న నిరసనకారులకు సహాయం చేయడానికి ముల్డర్ టైమ్ మ్యాగజైన్ యొక్క స్పూఫ్ కవర్‌లను సృష్టించారు. టైమ్ మీడియా లోగోను ఉపయోగించి అటువంటి ఫీచర్ చేసిన కవర్ చిత్రాలను రూపొందించే విధానాన్ని చూపించే వివరణాత్మక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
ఈ వైరల్ మ్యాగజైన్ కవర్ కూడా ఎవరో సృష్టించిన మాక్ ఆర్ట్‌వర్క్ మాత్రమే. న్యూస్‌మీటర్ వైరల్ కవర్ వెనుక ఉన్న కళాకారుడిని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ, ఇది టైమ్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన అసలు కవర్ కాదని స్పష్టమైంది.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.