అవసరమైన వారికి స్కూలు పుస్తకాలు, స్కూల్ ఫీజు కట్టలేని పిల్లలకు ఫీజులు కట్టేలా సహాయం కావాలని ఎదురుచూస్తూ ఉన్న వారు కొన్ని నంబర్‌లను సంప్రదించవచ్చని వాట్సాప్‌లో మొబైల్ నంబర్‌ల జాబితా వైరల్ అవుతోంది.
పోస్ట్‌లో ఇలా ఉంది, "స్కూల్ బుక్స్ అవసరం ఉన్న పిల్లలు, స్కూల్ ఫీజు చెల్లించలేని పిల్లలు ఈ క్రింది నంబర్‌లను సంప్రదించవచ్చు. వీలైనంత వరకు ఈ సందేశాన్ని ఇతరులకు పంపండి. పిల్లల జీవితాన్ని మార్చడానికి మీ సహాయం అవసరం." అంటూ అందులో ఉంది.
నిజ నిర్ధారణ :
2015 నుండి ఈ మొబైల్ నంబర్‌లు వైరల్ అవుతూ ఉన్నాయని NewsMeter కనుగొంది. మేము అదే క్లెయిమ్‌తో.. అదే ఫోన్ నంబర్‌లను షేర్ చేసిన 2015 ఫేస్‌బుక్ పోస్ట్ లో కూడా వీటినే గుర్తించాం. దాదాపు ప్రతి సంవత్సరం ఇదే సందేశం వైరల్ చేయబడుతోంది (2016, 2017 మరియు 2018 నుండి పోస్ట్‌లను చూడవచ్చు). ఈ సందేశం ఇతర భాషలలో కూడా వైరల్ చేయబడుతోంది (గుజరాతీ మరియు పంజాబీలో పోస్ట్ లు ఉన్నాయి).
మా బృందం జాబితాలోని అన్ని నంబర్‌లను సంప్రదించడానికి ప్రయత్నించింది కానీ ప్రస్తుతం ఏవీ యాక్టివ్‌గా లేవు. కొన్ని నంబర్లు వాడుకలో లేకపోగా, కొన్ని స్విచ్ ఆఫ్ అయ్యాయి. వైరల్ లిస్ట్ లోని నెంబర్స్ కు సంబంధించిన స్పాన్సర్స్ వివరాలు కూడా ఎక్కడా లభించలేదు.NGO లేదా ప్రైవేట్/ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వివరాలు కూడా కావివి.
2017లో, మహారాష్ట్రకు చెందిన పోలీసు అధికారి విశ్వాస్ నాంగ్రే పాటిల్ పేరుతో ఇదే సందేశం షేర్ చేయబడింది. ఆ సందేశం ఫేక్ అని సైబర్ క్రైమ్ డిప్యూటీ కమిషనర్ స్పష్టం చేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న ఈ పోస్టులు నకిలీవని తెలుస్తోంది.