FactCheck : వైరల్ వీడియోలో ఉన్నది టీడీపీ నేతలు మహిళపై చేస్తున్న దాడి కాదు
ఓ వ్యక్తి మహిళపై గొడ్డలితో దాడి చేయగా, మరో మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 July 2024 1:30 PM ISTహైదరాబాద్: ఓ వ్యక్తి మహిళపై గొడ్డలితో దాడి చేయగా, మరో మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఈ దాడికి తెగబడ్డాడనే వాదనలతో వీడియోను షేర్ చేస్తున్నారు.
“ఒక మహిళపై టీడీపీ గూండాల దాడి, గొప్ప పాలన” అనే క్యాప్షన్‌తో ఒక X వినియోగదారు ఈ వీడియోను షేర్ చేశారు.
https://newsmeter.in/h-upload/2024/07/10/376302-screenshot-2024-07-10-133926.webp
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని న్యూస్‌మీటర్ కనుగొంది. వైరల్ అవుతున్న వీడియో కుటుంబ కలహాలకు సంబంధించింది.
వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మాకు ఓ X వినియోగదారు చేసిన పోస్ట్ కనిపించింది. ఇది భూ వివాదానికి సంబంధించి అన్నయ్య తన సోదరిపై గొడ్డలితో దాడి చేస్తున్న వీడియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. “అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పెనకచెర్ల గ్రామంలో సోదరుడే భూ వివాదం కారణంగా గొడ్డలితో దాడి చేశాడు. మరో మహిళపై కూడా దాడి జరిగింది." అని తెలిపారు.
https://newsmeter.in/h-upload/2024/07/10/376303-screenshot-2024-07-10-161622.webp
అనంతపురం పోలీసులకు సంబంధించిన అధికారిక X హ్యాండిల్ కూడా ఈ ఘటనకు సంబంధించి వివరణను ఇచ్చింది. పెనకచర్ల గ్రామంలో మహబూబీపై గొడ్డలితో దాడి చేసిన సోదరుడు జిలానీని గార్లదిన్నె పోలీసులు అరెస్టు చేసినట్లు అనంతపురం రూరల్ డీఎస్పీ బివి శివారెడ్డి ధృవీకరించారు.
"స్థల వివాదంలో అక్కపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడి అరెస్టు
-- అనంతపురం రూరల్ డీఎస్పీ బి.వి.శివారెడ్డి
గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో అక్క మహబూబిపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు జిలానిని గార్లదిన్నె పోలీసులు అరెస్టు చేశారు. " అంటూ ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు.
స్థల వివాదంలో అక్కపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడి అరెస్టు
— Anantapur Police (@AnantapurPolice) July 9, 2024
-- అనంతపురం రూరల్ డీఎస్పీ బి.వి.శివారెడ్డి
గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో అక్క మహబూబిపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు జిలానిని గార్లదిన్నె పోలీసులు అరెస్టు చేశారు. #Anantapurpolice @APPOLICE100 pic.twitter.com/o9xA0PZSfZ
జూలై 10న, డెక్కన్ క్రానికల్ ఈ సంఘటనను "అనంతపురం: భూవివాదంపై గొడ్డలితో సోదరిపై దాడి చేసిన వ్యక్తి" అనే శీర్షికతో నివేదించింది. నివేదిక ప్రకారం, ఇంటి స్థలంపై వివాదం తర్వాత జిలానీ తన సోదరిపై జూలై 9న దాడి చేశాడు.
న్యూస్‌మీటర్ గార్లదిన్నె సబ్ ఇన్‌స్పెక్టర్ గౌస్ మహ్మద్ బాషాను సంప్రదించగా, ఆయన ఈ వివరాలను ధృవీకరించారు. “ఈ సంఘటన జూలై 9 ఉదయం 8:30 గంటలకు జరిగింది. భూమిపై కంచె వేసిన తర్వాత ఇంటి స్థలం వివాదంపై జిలానీ తన సోదరిపై దాడి చేశాడు. జిలానీ ఇప్పుడు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. అనంతపురం సబ్ జైలుకు పంపారు. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని, అనంతపురం జనరల్ ఆసుపత్రిలో మహబూబీకి చికిత్స అందించి డిశ్చార్జి చేయించారు" అని ఆయన తెలిపారు.
టీడీపీ గూండాలు మహిళలపై దాడి చేశారనే వాదన అవాస్తవం. కుటుంబ కలహాలతో జరిగిన ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదు.
Credit : Sibahathulla Sakib