పఠాన్ స్క్రీనింగ్ సమయంలో షారుఖ్ ఖాన్ అభిమానులు బజరంగ్ దళ్ కార్యకర్తలను కొట్టారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
'పఠాన్' చిత్రాన్ని థియేటర్‌లో ప్రదర్శించడాన్ని నిరసిస్తున్న బజరంగ్‌దళ్ సభ్యులను షారూఖ్ ఖాన్ అభిమానులు కొడుతున్నారని చెబుతూ వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలోని ఓ సినిమా హాల్ కు సంబంధించిన వీడియో అని న్యూస్ మీటర్ బృందం కనుగొంది. శీతల పానీయాల కోసం ప్రజలు గొడవ పడుతున్నారని.. 'పఠాన్' విడుదలైన మొదటి రోజున ఈ సంఘటన చోటు చేసుకుంది.
వీడియో కీఫ్రేమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించగా.. మేము జనవరి 27న ఆజ్ తక్ నివేదికను కనుగొన్నాము.'పఠాన్' స్క్రీనింగ్ సమయంలో అమ్రోహాలోని మధో సినీప్లెక్స్‌లో జరిగిన గొడవకు సంబంధించిన వీడియో చూపిస్తుంది. శీతల పానీయాల విషయంలో ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూప్ ల మధ్య ఈ ఘటన జరిగిందని స్పష్టంగా పేర్కొంది.
27 జనవరి 2023న టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన నివేదికలో వైరల్ వీడియోను కూడా మేము కనుగొన్నాము. అమ్రోహాలోని ఒక సినిమా హాలులో శీతల పానీయాల విషయంలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ ప్రదర్శన సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.
27 జనవరి 2023న, అమ్రోహా పోలీసులు ఈ గొడవ వెనుక కారణాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ట్విట్టర్ లో వీడియోను కూడా పోస్టు పెట్టారు. శీతల పానీయాల విషయంలో మాదో సినీప్లెక్స్ క్యాంటీన్‌లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగిందని.. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కూడా తెలిపారు.
‘పఠాన్’ సినిమా ప్రదర్శన సందర్భంగా కూల్ డ్రింక్స్ విషయంలో సినిమా హాలులో రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఇదని స్పష్టంగా తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ అభిమానులు బజరంగ్ దళ్ సభ్యులను కొడుతున్న వీడియో ఇదని చెబుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేదని మేము నిర్ధారించాము.