FactCheck : ప్రిన్స్ ఛార్లెస్ పట్టాభిషేకానికి సోనమ్ కపూర్ హాజరైందా..?

This video does not show Sonam Kapoor performing at King Charles III’s coronation. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ డ్యాన్స్ చేస్తూ ర్యాంప్‌పై నడుస్తున్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 May 2023 9:15 PM IST
FactCheck : ప్రిన్స్ ఛార్లెస్ పట్టాభిషేకానికి సోనమ్ కపూర్ హాజరైందా..?

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ డ్యాన్స్ చేస్తూ ర్యాంప్‌పై నడుస్తున్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కింగ్ చార్లెస్ III పట్టాభిషేకంలో ఆమె నృత్యం చేస్తున్నట్లు వీడియోను షేర్ చేస్తున్న వ్యక్తులు పేర్కొన్నారు.


నిజ నిర్ధారణ :

2019లో జరిగిన బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో సోనమ్ కపూర్ డ్యాన్స్ చేసిన వీడియో ఇదని న్యూస్‌మీటర్ కనుగొంది.

మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. 25 మార్చి 2019న ధృవీకరించబడిన YouTube ఛానెల్ 'పాప్ డైరీస్' ప్రచురించిన క్లిప్ ను కనుగొన్నాము. శీర్షిక ప్రకారం, బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2019లో సోనమ్ కపూర్ ర్యాంప్‌పై నడుస్తున్న వీడియో ఇది. కరణ్ , సందీప్ ఖోస్లాతో కలిసి నడుస్తున్నట్లు కూడా వీడియోలో ఉంది.

YouTube ఛానెల్, Biscoot TV కూడా అదే వీడియోను 25 మార్చి 2019న ప్రచురించింది. ఈ వీడియోకు “Sonam Kapoor’s AMAZING Dance Move at Ramp Walk with Karan Johar.” అనే టైటిల్ ఉంది.

బాలీవుడ్ నౌ అదే తేదీన అదే వీడియోను ఫేస్‌బుక్‌లో ప్రచురించింది. “Sonam Kapoor was seen dancing to Alia Bhatt’s #Kalank Song Ghar More Pardesiya at Abu Jani Sandeep Khosla show today at Bombay Times Fashion Week 2019.” అని కాప్షన్ ఉంది.

కింగ్ చార్లెస్ III పట్టాభిషేకంలో సోనమ్ కపూర్ ప్రదర్శన ఇచ్చారా?

ఏప్రిల్ 29న, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మే 7న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కింగ్ చార్లెస్ III పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొనడానికి సోనమ్ కపూర్‌ను ఆహ్వానించినట్లు నివేదించింది. ఆమె లియోనెల్ రిచీ, కాటి పెర్రీ వంటి గ్లోబల్ ఐకాన్‌లతో వేదికను పంచుకుంటుందని తెలిపారు.

మే 6న లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో కింగ్ చార్లెస్ చక్రవర్తిగా పట్టాభిషేకం చేయనున్నారు.

వైరల్ క్లిప్ 2019 నాటిదని, కింగ్ చార్లెస్ III పట్టాభిషేకంలో సోనమ్ కపూర్ డ్యాన్స్‌ చేయలేదని మేము నిర్ధారించాము. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.

Credits : Md Mahfooz Alam



Claim Review:ప్రిన్స్ ఛార్లెస్ పట్టాభిషేకానికి సోనమ్ కపూర్ హాజరైందా..?
Claimed By:Socialmedia Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story