కొన్ని పదార్థాలు మనిషికి ఎంతో హాని చేస్తూ ఉంటాయి. వాటికి దూరంగా ఉండాలని పలువురు వైద్యులు, నిపుణులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అయితే మనిషి అత్యంత హానికరమైన వస్తువులను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందంటూ ఓ లిస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రాణాంతకంగా ధృవీకరించిన మొదటి పది ఆహారాల విజువల్ గ్రాఫిక్‌తో కూడిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
WHO లోగో కూడా వైరల్ పోస్టులో ఉంది. పది కిల్లర్ ఆహారాలలో ఎనిమిది ఫిలిప్పీన్స్ లో ఉన్నాయని కూడా ప్రస్తావించబడింది.
నిజమెంత:
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) యొక్క అధికారిక సైట్‌లో న్యూస్‌మీటర్ ఈ వైరల్ జాబితాను కనుగొనడానికి ప్రయత్నించినప్పటికీ ఎటువంటి లిస్టు కూడా కనిపించలేదు.
వైరల్ పోస్టులను ఖండిస్తూ WHO వెస్ట్రన్ పసిఫిక్ ట్విట్టర్ హ్యాండిల్‌లో 17 జూన్ 2016 నాటి ట్వీట్‌ను మేము కనుగొన్నాము. "WHO ఎప్పుడూ 10 కిల్లర్ ఆహారాల జాబితాను విడుదల చేయలేదు" అని ట్వీట్ లో స్పష్టం చేసింది.
తాము ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో ట్వీట్‌లో పేర్కొంది. 29 ఏప్రిల్, 2020 న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన ఒక నివేదికను మేము కనుగొన్నాము.
https://www.who.int/news-room/fact-sheets/detail/healthy-diet
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలాంటి ప్రకటనలను చేస్తే మీడియా సంస్థలు తప్పకుండా వార్తలను ప్రచురిస్తాయి. అయితే ఏ మీడియా సంస్థ కూడా దీనిపై కథనాలను ప్రచురించలేదు. WHO ఇలాంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది.
10 ఆహార వస్తువులను తినకూడదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటువంటి సలహాలను జారీ చేయలేదని స్పష్టమవుతోంది. వైరల్ పోస్టు 2016 నుండి ప్రచారంలో ఉంది. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.