FactCheck : ఇళయ దళపతి విజయ్ బీమా ఎగవేతదారుడు అంటూ పోస్టులు..!

Thalapathy Vijay is not Insurance Defaulter Viral Claims are False. తమిళ నటుడు ఇళయ దళపతి విజయ్ బీమా ఎగవేతదారుడంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Feb 2022 5:04 PM IST
FactCheck : ఇళయ దళపతి విజయ్ బీమా ఎగవేతదారుడు అంటూ పోస్టులు..!

తమిళ నటుడు ఇళయ దళపతి విజయ్ బీమా ఎగవేతదారుడంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతూ ఉంది. ఆయన కారు ఇన్సూరెన్స్ కట్టకుండా ఉన్నారని ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలైంది.


విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎరుపు రంగు మారుతీ సెలెరియోలో వచ్చారు. అయితే ఆ కారు గురించి గూగుల్ లో సెర్చ్ చేసిన కొంతమందికి చెలాన్ పెండింగ్ లో ఉన్నట్టుగా తెలిసిందే. ఆర్టీవో పోర్టల్ ప్రకారం 2020లో కారు ఇన్స్యూరెన్స్ కంప్లీట్ అయ్యింది. 2021లో ఈ కారుపై ఓ పెండింగ్ చెలాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో యాంటీ విజయ్ ఫ్యాన్స్ ఆ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చెలాన్ కట్టడానికి డబ్బులు లేవంటూ ట్రోల్ చేస్తున్నారు.

Actor #Vijay came in red Maruti Celerio to cast his vote.

Sadly, the car's insurance validity was over in 2020 and an unpaid challan in 2021 as per RTO portal. అంటూ ఒక పోస్టు పెట్టారు.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టు నిజం కాదు.

న్యూస్‌మీటర్ వైరల్ పోస్టు తప్పు అని చెప్పే ఒక ట్వీట్‌ను కనుగొంది. ఓ బృందం కారు బీమా కాపీని షేర్ చేసింది.

ఇన్సూరెన్స్ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, రియాజ్ అనే వ్యక్తి "గత కొన్ని రోజులుగా, #ThalapathyVijay యొక్క కారు భీమా ఇంకా పెండింగ్ ఉందని పేర్కొంటూ వార్తలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. బీమా కాపీ ఇక్కడ ఉంది, అందులో బీమా మే 28, 2022 వరకు చెల్లుబాటులో ఉంటుందని స్పష్టంగా పేర్కొనబడింది! (sic)." అని క్లారిటీ ఇచ్చారు.



"For the past few days, news stating that #ThalapathyVijay's car insurance is still due and has been doing the rounds on social media. Here is a copy of the insurance, in which it is clearly stated that the insurance is valid till May 28, 2022! (sic)." అన్నదే పోస్టు.

ఫిబ్రవరి 19న, విజయ్ నీలంగరైలోని పట్టణ పౌర ఎన్నికల్లో ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వచ్చారు. ఆయనను మీడియా, అభిమానులు చుట్టుముట్టారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు ఆవేదన వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు.

https://www.indiatoday.in/movies/celebrities/story/tamil-nadu-urban-civic-polls-actor-vijay-apologises-for-causing-inconvenience-at-polling-booth-1915132-2022-02-19

కాబట్టి ఆయన ఇన్సూరెన్స్ ను ఎగ్గొట్టారనే పోస్టులు ఎలాంటి నిజం లేదు.


Claim Review:ఇళయ దళపతి విజయ్ బీమా ఎగవేతదారుడు అంటూ పోస్టులు..!
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story