Fact Check : అయోధ్యలో భారీ ధనుస్సును ఏర్పాటు చేశారా..?

Temple in viral image Picture of gigantic mace is from Gujarat, not Ayodhya. భారీ ధనుస్సు రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన

By Medi Samrat  Published on  19 Dec 2020 10:07 AM GMT
Fact Check : అయోధ్యలో భారీ ధనుస్సును ఏర్పాటు చేశారా..?

భారీ ధనుస్సు రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. ఓ కూడలిలో ఈ భారీ ధనుస్సును ఏర్పాటు చేశారని ఫోటో చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. నెటిజన్లు ఈ ధనుస్సును అయోధ్యలో ఏర్పాటు చేశారంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.



అధర్మం మీద ధర్మం గెలుపునకు గుర్తుగా భారీ ధనుస్సును ఏర్పాటు చేశారని చెబుతూ పోస్టుల్లో చెప్పుకొచ్చారు.

నిజ నిర్ధారణ:

న్యూస్ మీటర్ ఈ ఫోటో పై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వైరల్ పోస్టు జూన్ 2020 నుండి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది. అయోధ్యలో ఈ భారీ ధనుస్సును ఏర్పాటు చేశారని చెబుతున్నప్పటికీ.. కామెంట్స్ లో వడోదర, గుజరాత్ అని చెప్పారు.



కామెంట్ల ప్రకారం కీవర్డ్ సెర్చ్ చేయడమే కాకుండా గూగుల్ మ్యాప్స్ ద్వారా ఈ విషయం తెలుస్తోంది. గుజరాత్ లోని వడోదర లో ఉన్న హరిణి రోడ్ లో దీన్ని ఏర్పాటు చేశారు.

ఏప్రిల్ 15, 2016న వడోదరలోని శ్రీ భీడ్ భజన్ సర్కిల్ లో ఈ ధనుస్సును ఏర్పాటు చేశారు.

అయోధ్యలో భారీ ధనుస్సును ఏర్పాటు చేశారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఇది గుజరాత్ లోని వడోదరలో ఏర్పాటు చేశారు.


Claim Review:అయోధ్యలో భారీ ధనుస్సును ఏర్పాటు చేశారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story