FactCheck : దక్షిణాది నటుడు సుమన్ 117 ఎకరాలు ఆర్మీకి విరాళంగా ఇచ్చారా..?

Telugu Actor Suman has not donated 117 Acres of land to the army. దక్షిణాది నటుడు సుమన్ ఇండియన్ ఆర్మీకి 117 ఎకరాల భూమిని విరాళంగా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Feb 2022 8:15 PM IST
FactCheck : దక్షిణాది నటుడు సుమన్ 117 ఎకరాలు ఆర్మీకి విరాళంగా ఇచ్చారా..?

దక్షిణాది నటుడు సుమన్ ఇండియన్ ఆర్మీకి 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని ట్విట్టర్ యూజర్లు చెబుతున్నారు.ఆయన ఇలాంటి గొప్ప పని చేసినందుకు పలువురు ప్రశంసిస్తూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇండియన్ ఆర్మీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 117 ఎకరాల భూమిని సుమన్ విరాళంగా అందించినట్లు పోస్టులు వైరల్ అయ్యాయి.

"దేశ సరిహద్దుల్లో జవానులు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకొంటున్నారో నేను ప్రత్యక్షంగా చూసా.. దేశ సరిహద్దుల్లో జవానులు అన్నిటికి ఓర్చుకుని మనల్ని రక్షిస్తున్నారు. వాళ్ళలా మనం ఒక్కరోజు కూడా పని చేయలేము.. ఫ్యామిలీస్ కి దూరంగా మన కోసం బోర్డర్ లో అన్ని త్యాగం చేస్తున్నారు.. వాళ్ళను చూసినప్పుడు వాళ్ళ కోసం ఏదైనా చేయాలనీ అనిపించింది. అందుకే నేను నా భార్యతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నా" అని చెప్పారని కొన్ని కథనాలు కూడా వచ్చాయి.


నిజ నిర్ధారణ :

2019లో తెలంగాణలోని యాదాద్రిలో సుమన్ కుటుంబం 175 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని, అందులో ఆయుర్వేద రిసార్ట్‌ను నిర్మించాలని తొలుత భావించారని వార్తలు వచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో, నటుడు తన కుటుంబం తరువాత భూమిని ఆర్మీ, నేవీ మరియు డిఫెన్స్ సిబ్బంది కుటుంబాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.(Source: , STV News 24/7)

అనంతరం సుమన్ మాట్లాడుతూ.. డబుల్ రిజిస్ట్రేషన్ల కారణంగా భూములపై ​​కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని, కోర్టు తీర్పు రాగానే స్థలాన్ని సైనికులకు అప్పగిస్తామని చెప్పారు. 2020లో నటుడు ఈ సమస్యను ప్రస్తావించారు. సైట్‌పై వివాదం ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పారు. (మూలం: Samayam)

ఫిబ్రవరి 2022లో, కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉందని పేర్కొంటూ సుమన్ మళ్లీ వివరణ ఇచ్చారు. వివాదం ముగిసిన తర్వాత మీడియాకు వ్యక్తిగతంగా వివరాలు వెల్లడిస్తానని నటుడు చెప్పాడు. తాను భారత సైన్యానికి 117 ఎకరాల భూమి ఇచ్చానన్న వార్తలు అవాస్తవమని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఆ భూమి వివాదం ఇంకా కోర్టులో ఉందని..

వివాదం పరిష్కారం అయిన వెంటనే అందరికీ తెలియజేస్తానని ఆయన అన్నారు. ." (మూలం: న్యూస్ 18, 10 టీవీ, సాక్షి)

ఇండియన్ ఆర్మీకి ఇచ్చినట్టుగా చెబుతున్న భూమి వివాదంలో ఉందని, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉందని చెప్పారు. వివాదం పరిష్కారమైన వెంటనే తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తానని సుమన్ చెప్పారు. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే ఇలాంటి వార్తలను నమ్మొద్దని సుమన్ కోరారు. ఆ భూమికి సంబంధించిన వివాదం ఇంకా కోర్టులో కొనసాగుతోంది. వివాదానికి పరిష్కారం రాగానే వ్యక్తిగతంగా నేనే వివరాలు మీడియా ద్వారా వెల్లడిస్తానన్నారు.

కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review:దక్షిణాది నటుడు సుమన్ 117 ఎకరాలు ఆర్మీకి విరాళంగా ఇచ్చారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story