FactCheck : బాయ్ కాట్ పిలుపులకు భయపడి షారుఖ్ సినిమా పేరు పఠాన్ నుండి జవాన్ గా మార్చారా..?
SRKs Pathan has ot been renamed Jawan over Boycott Fears. ఇటీవల పలు బాలీవుడ్ సినిమాలు బాయ్ కాట్ పిలుపులను అందుకుంటూ ఉన్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Sept 2022 9:15 PM ISTఇటీవల పలు బాలీవుడ్ సినిమాలు బాయ్ కాట్ పిలుపులను అందుకుంటూ ఉన్నాయి. ఎన్నో సినిమాలపై బాయ్ కాట్ అంటూ పిలుపులు రావడంతో వాటిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీగా కలెక్షన్స్ దెబ్బతిన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలపై కూడా బాయ్ కాట్ ప్రభావం పడనుంది. తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సినిమాపై కూడా ఇలాంటి కథనాలనే ప్రసారం చేస్తూ వస్తున్నారు. షారుఖ్ ఖాన్ రాబోయే చిత్రం 'జవాన్' కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు ఇంతకు ముందు 'పఠాన్' అనే పేరును పెట్టారని.. బాయ్ కాట్ పిలుపులకు భయపడి 'జవాన్' అనే పేరును ఉంచారని చెప్పుకొచ్చారు.
"Loser renames his upcoming film #Pathan as #Jawan. Renaming Paratha to #Puri will not do anything loser. Boycott means boycott," అంటూ పేరు మార్చినా కూడా సినిమాను బాయ్ కాట్ చేయడాన్ని ఆపలేరంటూ హెచ్చరిస్తున్న పోస్టులను మనం చూడవచ్చు.
కొంతమంది బాలీవుడ్ నటీనటులు 'నేను అనుకున్నదే జరుగుతుంది' అనే వైఖరి ప్రజలకు కోపం తెప్పించింది. ఫలితంగా బాలీవుడ్‌లో ప్రస్తుత బాయ్‌కాట్ ట్రెండ్ ఏర్పడిందని చెప్పుకొస్తున్నారు. ఇటీవలే అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా కూడా బహిష్కరణకు గురైంది. అదే విధంగా, లైగర్‌ను కూడా బహిష్కరించారు. #Boycottbrahmastra కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
शाहरुख़ खान ने अपने आनेवाली फिल्म पठान का नाम बदलकर जवान किया,
— bhagwadhari yodha ⚔️🚩 (@bhagwa_yodha) August 28, 2022
पहले लिखते थे बॉयकॉट पठान ..! अब लिखेंगे बॉयकॉट जवान ..!
😡बॉयकॉट जवान😡
షారుక్ ఖాన్ రాబోయే చిత్రం పఠాన్ ఇప్పటికే బాయ్‌కాట్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో ఉంది. షారుక్ ఖాన్ జవాన్ కొత్త సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇక షారుక్ ఖాన్ పఠాన్ పేరును జవాన్ గా మార్చారని నెటిజన్లు పేర్కొన్నారు.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం.. ఒక కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. పఠాన్, జవాన్ సినిమాలు 2023లో విడుదల కానున్న షారుఖ్ ఖాన్ సినిమాలు. ఈ రెండు వేర్వేరు సినిమాలు. పఠాన్ జనవరి 25, 2023న విడుదల కాబోతోంది.
ఇక 'జవాన్' సినిమా దక్షిణాది దర్శక, రచయిత అట్లీ తీస్తున్న హిందీ భాషా యాక్షన్ థ్రిల్లర్. ఇందులో షారూఖ్ ఖాన్, విజయ్ సేతుపతి, నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చారు. రెండు సినిమాల సంబంధిత ట్రైలర్‌ల కోసం సోషల్ మీడియా హ్యాండిల్‌లను స్కాన్ చేసాము.
ఇంకా పఠాన్ సినిమా ట్రైలర్ విడుదల చేయలేదు కానీ.. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్స్ షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహాం, దీపిక పదుకోన్ సోషల్ మీడియా లో చూడవచ్చు.
'Red Chillies Entertainment యూట్యూబ్ ఛానల్ లో జవాన్ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ ను మనం చూడవచ్చు. టైటిల్ అనౌన్స్మెంట్ ను 'JAWAN | Title Announcement | Shah Rukh Khan | Atlee Kumar | గా తెలిపారు. ఈ సినిమా 02 జూన్ 2023న విడుదల కాబోతోంది.
మేము ఇండియా టుడే నివేదికను కనుగొన్నాము. "పఠాన్ టైటిల్ మార్పుపై వచ్చిన పుకార్లలో నిజం లేదు. మేకర్స్ టైటిల్ పట్ల చాలా నమ్మకంతో ఉన్నారు. జాన్ అబ్రహాం ఫస్ట్ లుక్‌ను కూడా అదే టైటిల్‌తో విడుదల చేశారు." పఠాన్ నిర్మాతలు (YRF) టైటిల్ ను మార్చినట్లు ఎటువంటి కథనం కూడా కనిపించలేదు.
బాయ్ కాట్ ట్రెండ్ కు భయపడి పఠాన్ పేరును జవాన్‌గా మార్చలేదు. ఇవి రెండు.. వేర్వేరు సినిమాలు.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.