Fact Check : సోనూ సూద్ తన కొడుక్కు మూడు కోట్ల రూపాయల కారును గిఫ్ట్ గా ఇచ్చాడా..?

Sonu Sood did not gift rs3 crore Mercedes Car to his son. సోనూ సూద్ తన కుమారుడికి Mercedes- Maybeach GLS600 కారును బహుమతిగా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Jun 2021 6:32 AM GMT
Fact Check : సోనూ సూద్ తన కొడుక్కు మూడు కోట్ల రూపాయల కారును గిఫ్ట్ గా ఇచ్చాడా..?
సోనూ సూద్ తన కుమారుడికి Mercedes- Maybeach GLS600 కారును బహుమతిగా ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ కారు విలువ మూడు కోట్ల రూపాయలు. అంత విలువైన కారును సోనూ సూద్ తన కుమారుడికి గిఫ్ట్ గా ఇచ్చాడంటూ పలువురు పోస్టులు పెట్టారు. ఫాదర్స్ డే గిఫ్ట్ గా ఈ కారును ఇచ్చాడంటూ ట్వీట్లు కూడా చేశారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఈ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

సోనూ సూద్ ప్రస్తుతం ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నాడు. తనకు చేతనైనంత సహాయాన్ని అడిగిన వాళ్లకు కాదనకుండా చేస్తూ వస్తున్నాడు.

ఈ వదంతులు ఓ వైరల్ వీడియో ద్వారా ప్రచారం అవుతున్నాయి. ఆ వైరల్ వీడియోలో సోనూ సూద్ కారును తన కుమారుడికి గిఫ్ట్ గా ఇచ్చాడంటూ చెప్పుకొచ్చారు.


వైరల్ వీడియో ఆధారంగా సోనూ సూద్ కారును డెలివరీ తీసుకుని.. తన పిల్లలతో పాటూ కారులో షికారుకు వెళ్ళారు. దీన్నే సోనూ గిఫ్ట్ గా ఇచ్చాడంటూ కథనాలను ప్రసారం చేశారు.

ఈ వైరల్ వార్తలపై సోనూ సూద్ కూడా స్పందించాడు. పలు మీడియా సంస్థలు సోనూ సూద్ స్పందనను ప్రచారం చేశారు. ఈ కథనాలలో ఎటువంటి నిజం లేదని సోనూ సూద్ చెప్పుకొచ్చారు.

ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పారు. తన కొడుక్కు కారు కొనలేదని.. కేవలం ట్రయల్‌ కోసమే కొత్తకారును ఇంటికి తీసుకొచ్చామే తప్ప దాన్ని కొనుగోలు చేయలేదని వివరణ ఇచ్చారు. అయినా ఫాదర్స్‌డే రోజు పిల్లలు తనకేదైనా ఇవ్వాలి కానీ తానెందుకు వాడికి కారు బహుమతిగా ఇస్తాననని ప్రశ్నించాడు.

ఇక పలు మీడియా సంస్థలు ఆ కారు ధర మూడు కోట్ల రూపాయలు అని చెబుతున్నాయి. ఈ కారు బేస్ వేరియంట్ ధర 2.43 కోట్ల రూపాయలు ఉంది.

సోనూ సూద్ తన కొడుక్కు మూడు కోట్ల రూపాయల కారును గిఫ్ట్ గా ఇచ్చాడంటూ వైరల్ అవుతున్న వార్తల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review:సోనూ సూద్ తన కొడుక్కు మూడు కోట్ల రూపాయల కారును గిఫ్ట్ గా ఇచ్చాడా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media
Claim Fact Check:False
Next Story