విమానం కూలిపోతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్చి 21న చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌లో కుప్పకూలిన ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ విమానం వీడియో అని యూజర్లు పేర్కొంటున్నారు.
A Boeing 737 just crashed in southern China. This was one of the last moment recorded on the plane. maybe the only moment. Viewers' discretion advised. #planecrash#Boeing#Chinapic.twitter.com/YvTpSNSCV9
విమానం లోపల నుంచి వీడియో తీసినట్లు తెలుస్తోంది. "దక్షిణ చైనాలో ఇప్పుడే బోయింగ్ 737 కూలిపోయింది. విమానంలో రికార్డ్ చేయబడిన చివరి క్షణాలలో ఇది ఒకటి. బహుశా ఒకే ఒక్క క్షణం" అనే టెక్స్ట్‌తో వీడియో షేర్ చేయబడింది. "A Boeing 737 just crashed in southern China. This was one of the last moments recorded on the plane. maybe the only moment. Viewers' discretion advised." అన్నది వీడియో క్యాప్షన్.
వైరల్ వీడియోను న్యూస్ మీటర్ బృందం నిశితంగా పరిశీలించగా విమానం పై ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ లోగోను గమనించింది.
దాన్ని హింట్ గా తీసుకుని.. న్యూస్‌మీటర్ ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ క్రాష్ వీడియోల కోసం సెర్చ్ చేసింది. అదే విజువల్స్‌తో కూడిన యూట్యూబ్ వీడియోను కనుగొంది. వీడియో 11 మార్చి 2019న అప్‌లోడ్ చేయబడింది. "Ethiopia Plane Crash, Ethiopia Airlines B737 MAX Crashes After Takeoff" అనే శీర్షికతో ఉంది. వైరల్ క్లిప్ 9:33 సమయం దగ్గర చూడవచ్చు.
వివరణ ప్రకారం.. వీడియో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ET302 విమాన ప్రమాదంకు సంబంధించింది. అసలు ఏం జరిగిందో చూపించనప్పటికీ ఇది యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. 10 మార్చి 2019న అడిస్ అబాబా టేకాఫ్ అయిన వెంటనే జరిగిన ప్రమాదంలో 157 మంది చనిపోయారు.
132 మందితో ప్రయాణిస్తున్న బోయింగ్ 737 ప్యాసింజర్ విమానం మార్చి 21న చైనాలో కుప్పకూలింది. ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.. ఈ ప్రమాదం కారణంగా అడవుల్లో మంటలు చెలరేగాయని, తర్వాత దానిని ఆర్పివేశారని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
Video footage taken by local villagers shows the aftermath of a plane crash in south China on Monday. The Boeing 737 crashed with 132 people on board. #mu5735pic.twitter.com/Pg9gJeiHIA
చైనాలో ఇటీవల ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదానికి.. ఇథియోపియన్ విమానం కూలిపోయిన వీడియో ను లింక్ చేస్తూ షేర్ చేయబడింది. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Claim Review:చైనా విమానం కూలిపోతున్న విజువల్స్ ఇవేనా..?