బీజేపీ కార్యకర్తలు, నేతల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఉన్న సైన్ బోర్డు ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"బీహార్ లోని భోజ్పూర్ దగ్గర ఉన్న జగదీష్ పూర్ గ్రామంలోకి బీజేపీ సభ్యులను అనుమతించరు" అని సైన్ బోర్డు హిందీలో ఉంది. బీజేపీ నేతలు ఎవరైనా గ్రామంలోకి వస్తే కాళ్లు ఇరగ్గొట్టడం జరుగుతుంది అని ఉంది.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టులు ' ప్రజలను తప్పుద్రోవ పట్టించేలా ఉన్నాయి'.
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా డెక్కన్ హెరాల్డ్ కథనం చూడొచ్చు. "బిజెపి సభ్యులను లోపల అనుమతించరు" అంటూ గ్రేటర్ నోయిడా గ్రామం బయట ఒక బోర్డు ఉంది.
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ దత్తత తీసుకున్న గ్రేటర్ నోయిడాలోని గ్రామం ప్రవేశద్వారం వద్ద ఈ బోర్డును ఏర్పాటు చేశారు. "బిజెపి సభ్యులను లోపల అనుమతించరు" అని అందులో ఉంది.
స్థానిక పరిపాలన అధికారులు మరియు రియాల్టీ గ్రూపు ఉద్యోగులు రైతు పంటను ధ్వంసం చేశారనే ఆరోపణలతో అక్టోబర్ 28 న బోర్డును ఏర్పాటు చేశారు. డెక్కన్ హెరాల్డ్ ప్రచురించిన అసలు చిత్రాన్ని మేము కనుగొన్నాము. మరో కాంక్రీట్ బోర్డ్ మార్ఫింగ్ చేయబడిందని స్పష్టంగా తెలుస్తోంది.
రెండు ఫోటోలను చూడగా అందులో ఉన్న తేడాలను చూడొచ్చు.
ఈ ఆధారాలను బట్టి వైరల్ అవుతున్న ఫోటోను ఎడిట్ చేశారని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఫోటో బీహార్ లో తీసింది కాదు. ఉత్తరప్రదేశ్ లోనిది. వైరల్ అవుతున్న పోస్టులు 'ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తోంది'.