శివ సేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఓ కుర్తాను వేసుకొని ఉండగా.. ఆ కుర్తా మీద నమో అగైన్(మరో సారి నరేంద్ర మోదీ) అని ఉంది. ఈ ఫోటోను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఉన్నారు.
శివసేన ఎంపీ కూడా మోదీకే మద్దతు తెలుపుతోంది అనే అర్థం వచ్చేలా ఆ డ్రెస్ మీద ఉన్న నినాదం చెబుతోందంటూ కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు.
చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఇదే తరహా ప్రచారం చేస్తూ ఉన్నారు.
प्रियंका चतुर्वेदी जी को नमो अगेन में आने के बाद अब
रा़क्षक कुल के श्रेष्ठ नेता खड़के भी कांग्रेस छोड़ने की खबर आ रही है अरे भाजपा वालो कम से कम इस गैंडे को तो पार्टी में शामिल मत करना 😂😜 pic.twitter.com/gF0e8ffi7X
नमो आगे के जलवे में जलसे में एक नाम और जुड़ा कांग्रेस की महत्वपूर्ण प्रवक्ता कांग्रेस निष्ठ महिला प्रवक्ता प्रियंका चतुर्वेदी अब नमो अगेन के साथ आ गई है शिवसेना में शामिल हो गई है pic.twitter.com/NZA3g4FRId
ప్రియాంక చతుర్వేది రాజకీయ ప్రస్థానం గురించి న్యూస్ మీటర్ వెతకగా.. ఆమె శివసేనలో చేరకముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి ఆమె మోదీ మద్దతుదారు అనే కథనాల్లో ఎటువంటి నిజం లేదు. ఆమె వికీపీడియా పేజీలో సమాచారాన్ని చూడొచ్చు.
ఇక ఆ ఫోటోలో ఉన్న వారిని కనుక్కోడానికి గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా
Hemisha Thakkar అనే మహిళ ట్విట్టర్ అకౌంట్ లో నమో అగైన్ అనే కుర్తాను వేసుకుని ఉండడం చూడొచ్చు. వైరల్ ఫోటోలో ప్రియాంక చతుర్వేది వేసుకున్న కుర్తా కూడా అచ్చం అలాంటిదే..! రెండు ఫోటోలు కూడా దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.
రెండు ఫోటోలను పక్క పక్కనే పెట్టి చూడగా.. అన్నీ ఒకేలా ఉన్నాయి. కేవలం తలను మాత్రమే మార్చినట్లుగా స్పష్టం అవుతోంది.
ప్రియాంకకు చెందిన పాత ఫోటోను వాడి ఈ ఫోటోకు ఎడిటింగ్ చేసి తగిలించారని స్పష్టంగా తెలుస్తోంది. ఆమె పాత ఫోటోను ఇక్కడ మీరు చూడొచ్చు. ఒరిజినల్ ఫోటోలో ఆమె చీర ధరించి ఉన్నారు.
విశ్వాస్ న్యూస్ మీడియా సంస్థ ఈ ఫోటో గురించి సంప్రదించగా.. తాను అలాంటి కుర్తీని ధరించలేదని మీడియాకు తెలిపింది. గతంలో పలు మార్లు తన ఫోటోల విషయంలో వైరల్ అయ్యాయని.. ఇది కూడా అలాంటి ఫోటోనే అని ఆమె చెప్పుకొచ్చింది. కొందరు రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికే ఇలా ఫేక్ ఫోటోలను క్రియేట్ చేస్తున్నారని ఆమె తెలిపింది.
కాబట్టి వైరల్ అవుతున్న ఫోటోలలో ఎటువంటి నిజం లేదు. ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో.
Claim Review:శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది 'నమో అగైన్' అనే నినాదం ఉన్న కుర్తాను వేసుకున్నారా..?