FactCheck : పాక్ ఎన్జీవో కు పఠాన్ సినిమా ఆదాయాన్ని విరాళంగా ఇస్తానని షారుఖ్ ఖాన్ చెప్పలేదు..!

Shah Rukh Khan did not promise to donate Pathaan earnings to Pak NGO. Know the truth. షారూఖ్ ఖాన్ గురించి బీబీసీ న్యూస్ హిందీ చేసిన ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Dec 2022 9:00 PM IST
FactCheck : పాక్ ఎన్జీవో కు పఠాన్ సినిమా ఆదాయాన్ని విరాళంగా ఇస్తానని షారుఖ్ ఖాన్ చెప్పలేదు..!

షారూఖ్ ఖాన్ గురించి బీబీసీ న్యూస్ హిందీ చేసిన ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం 'పఠాన్' మొదటి రోజు సంపాదనను పాకిస్థాన్ ఎన్జీవోకు విరాళంగా ఇస్తానని షారుఖ్ ఖాన్ చెప్పినట్లు వైరల్ పోస్టులో ఉంది.

షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ, "పాకిస్తాన్ నా రెండవ ఇల్లు, పఠాన్ మొదటి రోజు సంపాదన పాకిస్తాన్ ఎన్జీవో కు విరాళంగా ఇస్తాను." అన్నట్లుగా పోస్టు వైరల్ అవుతోంది.

'పఠాన్'లోని మొదటి పాట విడుదలైన తర్వాత ఎన్నో వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి.


నిజ నిర్ధారణ:

NewsMeter వైరల్ స్క్రీన్‌షాట్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని అమలు చేసింది. సంబంధిత వార్తలకు సంబంధించిన సూచనలు ఏవీ కనుగొనలేదు. షారుఖ్ ఖాన్ లేదా దీపికా పదుకొణె చేసిన అలాంటి ప్రకటనలకు సంబంధించి మేము ఇతర వార్తా నివేదికలను కనుగొనలేకపోయాము.

వైరల్ స్క్రీన్‌షాట్‌లో పేర్కొన్న తేదీని15 డిసెంబర్ 2022 అని ఉండగా.. సూచనగా తీసుకొని, మేము BBC న్యూస్ హిందీ ట్విట్టర్ పేజీని పూర్తిగా వెతికాం.. కానీ షారుఖ్ ఖాన్ ప్రకటన గురించి ఎటువంటి పోస్ట్ కనుగొనలేకపోయాము.


మేము వైరల్ స్క్రీన్‌షాట్‌ను నిశితంగా పరిశీలించాము. ట్వీట్ యొక్క కుడి దిగువ మూలలో "Twitter for OKsatire" అని ఉండడాన్ని గమనించాం. దీన్ని బట్టి ఈ స్క్రీన్ షాట్ ఎడిట్ చేసిందని గుర్తించాం.

కాబట్టి, వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో ఎలాంటి నిజం లేదు.


Claim Review:పాక్ ఎన్జీవో కు పఠాన్ సినిమా ఆదాయాన్ని విరాళంగా ఇస్తానని షారుఖ్ ఖాన్ చెప్పలేదు..!
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story