సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక ముస్లిం వ్యక్తి తన శరీరాన్ని చూపించడానికి బహిరంగంగా తన చొక్కా తీసివేసిన అతడికి ఒక హిందూ మహిళ బుద్ధి చెప్పిందనే వాదనతో వీడియోను పోస్టు చేశారు.
ఈ వీడియోను X యూజర్ “చప్రీ అబ్దుల్ తన శరీరాన్ని హిందూ మహిళకు చూపించడానికి తన చొక్కా తీసివేసాడు. ధైర్యమైన హిందూ మహిళ అతడిని ఎదుర్కొంది. అధర్మాన్ని ఎదిరించండి. ఇదే సరైన మార్గం." అని తెలిపారు.
22 సెకన్ల నిడివి గల వీడియోలో ఒక వీధిలో మరో వ్యక్తితో కలిసి నడుస్తున్న మహిళ ముందు ఒక వ్యక్తి తన కండలను చూపుతున్నట్లు తెలుస్తోంది. స్త్రీ అతనిని చెంపదెబ్బ కొట్టి, అతని చొక్కా తిరిగి వేసుకోమని హిందీలో చెప్పింది.
ఇలాంటి పోస్ట్‌లు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తెలిపింది. వీడియో స్క్రిప్టెడ్ అని స్పష్టంగా తెలుస్తోంది.
నిజంగా జరిగిన గొడవ కాదు. వీడియో ఎఫెక్ట్‌లు, నేపథ్య సంగీతం, ఇతర ఘటనలతో సీన్ ను నాటకీయంగా మార్చారు. ఆ తర్వాత కంటెంట్ ను ఎడిట్ చేశారని తెలుస్తోంది.
వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మేము అదే వాదనతో Instagram పోస్ట్‌లో వీడియోను కనుగొన్నాము. అయితే, ఆ వీడియో అవగాహన కోసం స్క్రిప్ట్ చేశారని క్యాప్షన్ చివరలో పేర్కొన్నారు.
అదేవిధంగా, తమన్నా కోహ్లీ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూడా మేము వీడియోను కనుగొన్నాము. తన బయోలో కంటెంట్ క్రియేటర్ అని పేర్కొన్నారు.
ఆమె ఖాతాని పరిశీలిస్తే, కొందరు వ్యక్తులు తమ షర్టులను పబ్లిక్‌గా తీసివేసినప్పుడు ఆమె పబ్లిక్‌గా అందరినీ 'ఎదిరించే' వీడియోలను మేము కనుగొన్నాము. వీడియోలు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
వైరల్ వీడియోలో కనిపించిన పురుషులు ఆమె ఖాతాలో షేర్ చేసిన ఇతర వీడియోలలో కూడా కనిపించారు. తన శరీరాన్ని ప్రదర్శిస్తున్న వ్యక్తిని ఈ వీడియోలో చూడవచ్చు. వైరల్ వీడియోలో ఆమెతో పాటు ఉన్న వ్యక్తి ఇక్కడ కూడా కనిపిస్తాడు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాము. వీడియో స్క్రిప్టెడ్ అని మేము గుర్తించాం. వైరల్ వీడియోలో మతపరమైన అంశాలు లేవని ధృవీకరించాం.
Credit : Sibahathulla Sakib