Fact Check : ప్లాస్టిక్ ను తినే ఫంగస్ పుట్టుకొచ్చిందా..?

Scientists Discover Fungus That Feeds on Plastic. పుట్టగొడుగులు మరియు ప్లాస్టిక్ బాటిల్ వ్యర్థాలు కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 July 2021 12:59 PM GMT
Fact Check : ప్లాస్టిక్ ను తినే ఫంగస్ పుట్టుకొచ్చిందా..?

పుట్టగొడుగులు మరియు ప్లాస్టిక్ బాటిల్ వ్యర్థాలు కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెజాన్ లో కొత్త ఫంగస్ జాతి పుట్టుకొచ్చిందని.. అది ప్లాస్టిక్‌ ను తింటూ ఉందని చెప్పుకొచ్చారు.

"ఇది ప్లాస్టిక్‌పై మాత్రమే జీవించగలదు, ఆక్సిజన్ కూడా అవసరం ఉండదు, బయోరిమిడియేషన్ యొక్క కొత్త పద్ధతుల వైపు దారి తీస్తుంది" అని ఉన్న మెసేజ్ వైరల్ అవుతోంది. "It can live on plastic alone, and can do so without oxygen, potentially leading the way towards new techniques of bioremediation," అంటే ప్లాస్టిక్ ను తిని బ్రతుకుతోంది ఈ సరికొత్త ఫంగస్ అన్నది వైరల్ అవుతున్న కథనాల సారాంశం.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న మెసేజీ నిజమే..!

దీనిపైన పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అది నిజమేనని గుర్తించారు. కొన్ని జాతులకు చెందిన ఫంగస్ ప్లాస్టిక్ ను తినగలదని చెబుతున్నారు. అలాగే దీనికి ఆక్సిజన్ అవసరం కూడా లేదని తెలుస్తోంది.

Treehugger.com కథనం ప్రకారం.. యేల్ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో కూడా ఇదే విషయమే రుజువైంది. అరుదైన పుట్టగొడుగును అమెజాన్ అడవిలో 2011 లో కనుక్కున్నట్లు తెలిసిపారు. క్లాస్ రీసెర్చ్ ట్రిప్‌లో విద్యార్థులు 2011 లో ఈక్వెడార్‌లోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో అరుదైన పుట్టగొడుగును కనుగొన్నారు. 'పెస్టలోటియోప్సిస్ మైక్రోస్పోరా' అనే ఫంగస్ ప్లాస్టిక్ ఉత్పత్తులలో సాధారణ పాలిమర్ అయిన పాలియురేతేన్ మీద పెరుగుతుంది. దానిని కార్బన్ వనరుగా ఉపయోగించుకుంటోంది.

యేల్ పరిశోధన బృందం ప్రకారం సాదాగా కనిపించే లేత గోధుమ పుట్టగొడుగులు ఆక్సిజన్‌ అవసరం లేకుండా వాతావరణంలో జీవించగలవు. పాలియురేతేన్‌ను సేంద్రీయ పదార్థంగా మార్చడానికి ముందు వాటిని విచ్ఛిన్నం చేసి జీర్ణించుకోగలవు.

2017 లో శాస్త్రవేత్తల బృందం పాకిస్తాన్లోని ఒక సాధారణ నగర వ్యర్థాలను పారవేసే ప్రదేశంలో ప్లాస్టిక్ తింటున్న మరో పుట్టగొడుగును కనుగొంది. 'ఆస్పెర్‌గిల్లస్ ట్యూబిన్జెన్సిస్' అని పిలువబడే ఫంగస్, పాలిస్టర్ పాలియురేతేన్‌ను రెండు నెలల తరువాత చిన్న ముక్కలుగా విడగొట్టగలదని గుర్తించారు.


టెక్ ఇన్సైడర్ యూట్యూబ్లో ప్రచురించిన వీడియోలో యేల్ విద్యార్థుల ప్రయోగాన్ని మనం చూడవచ్చు.

పాకిస్తాన్ లో కనుగొన్న విషయానికి సంబంధించిన కథనాలను కూడా మనం పలు మీడియా సంస్థల్లో చూడొచ్చు.

https://theprint.in/science/these-plastic-eating-fungi-may-be-the-answer-to-our-garbage-epidemic/121781/

https://www.jagranjosh.com/general-knowledge/do-you-know-about-the-plastic-eating-fungus-discovered-in-pakistan-1506503862-1

రీసర్చ్ కు సంబంధించిన సమాచారం ఈ లింక్ లో ఉంది.

https://journals.asm.org/doi/10.1128/AEM.00521-11

interstingengineering.com లో ఇందుకు సంబంధించిన ఆసక్తికర కథనాన్ని చూడొచ్చు. 'Mycoremediation - which is an experimental technique that harnesses mushrooms' అంటూ ఈ పుట్టగొడుగులను సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. దెబ్బతిన్న పర్యావరణ వ్యవస్థల నుండి కొన్ని కలుషితాలను వదిలించుకోవడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోడానికి ఈ చౌక, సమర్థవంతమైన సాంకేతికత ఉపయోగించవచ్చు.

Times of India.com కథనం ప్రకారం గుజరాత్‌లోని ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రదేశమైన పిరానా వద్ద పరిశోధకుల బృందం చిన్న ప్లాస్టిక్ తినే బ్యాక్టీరియాను కనుగొంది. ఈ అధ్యయనంలో 17 తరగతుల బ్యాక్టీరియా మరియు ప్లాస్టిక్ తినే 9 శిలీంధ్రాలు కనుగొనబడ్డాయి.

'Landfill microbiome harbor plastic-degrading genes: A metagenomic study of solid waste dumping site of Gujarat, India' అనే జర్నల్ పేపర్ లో ఈ విషయాలన్నీ ఉన్నాయి.

మరింత సమాచారం ఇందులో కూడా ఉంది

https://news.sky.com/story/plastic-eating-fungus-could-help-fight-against-waste-11495833

కాబట్టి వైరల్ అవుతున్నట్లుగా ప్లాస్టిక్ ను తినే ఫంగస్ ఉందన్న వార్తలు నిజమే..!


Claim Review:ప్లాస్టిక్ ను తినే ఫంగస్ పుట్టుకొచ్చిందా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:True
Next Story