పట్టపగలు కారులో ఒక రిపోర్టర్‌ని అపహరించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సంఘటన నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో జరిగిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
“దిమాపూర్‌లో పట్టపగలు రిపోర్టర్ కిడ్నాప్ అయ్యాడు” అనే క్యాప్షన్‌తో ఫేస్‌బుక్ వినియోగదారులు వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో భోజ్‌పురి సినిమా షూటింగ్ కు సంబంధించిన వీడియో అని న్యూస్‌మీటర్ కనుగొంది.
కామెంట్ సెక్షన్స్ ను పరిశీలించగా.. కొందరు ఇది సినిమా షూటింగ్ వీడియో అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్లిప్ భోజ్‌పురి చిత్రం “హమ్ హై రౌడీ SP విజయ్” సినిమా షూటింగ్ కు సంబంధించినవని ఒక వినియోగదారు చెప్పినట్లు మేము కనుగొన్నాము. ఈ సినిమాను 2022లో నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో చిత్రీకరించారని.. చిత్రానికి సంబంధించిన యూట్యూబ్ లింక్‌ను కూడా షేర్ చేశారు.
ఆ వీడియో లింక్ లోని 8.53 నిమిషాల వద్ద వైరల్ వీడియో మనకు కనిపిస్తుంది. అందులో వైరల్ వీడియోలో ఉన్న రిపోర్టర్ కెమెరామెన్లు సినిమా సీన్ లో కూడా కనిపిస్తారు. తెలుపు రంగు ఓమ్నీ కారు వేగంగా వచ్చి ఆగగానే.. అందులోకి లాక్కుని వెళ్ళిపోతారు. రిపోర్ట్రర్ ను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లగా.. ఆ కారు వెంట.. కెమెరామెన్ పరిగెత్తడం మనం చూడొచ్చు.
వైరల్ వీడియోకు, సినిమాలోని సన్నివేశానికి సంబంధించిన పోలికలను మీరు ఈ ఫోటోలో గమనించవచ్చు.
గూగుల్ స్ట్రీట్ వ్యూలో, వైరల్ వీడియో, యూట్యూబ్ వీడియోలోని దృశ్యాలు నాగాలాండ్‌లోని దిమాపూర్‌లోని సిటీలో చిత్రీకరించారని మేము ధృవీకరించాము.
రిపోర్టర్ కిడ్నాప్ ను చూపుతున్న వైరల్ క్లిప్.. ఒక సినిమాకు సంబంధించిందని, అది నిజమైన సంఘటన కాదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam