బాలీవుడ్ నటుడు, గురుదాస్‌పూర్ ఎంపీ సన్నీ డియోల్ ఆకస్మికంగా చనిపోయారంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఆయన మరణం గురించి షాకింగ్ కథనం అంటూ.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది జూలైలో సన్నీ డియోల్ అస్వస్థతకు గురయ్యారని మీడియాలో వార్తలు రావడంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
ఆయన కోలుకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఆయన చనిపోయారనే వార్తలు మాత్రం వైరల్ గా మారాయి.
సన్నీ డియోల్ ఇప్పుడు మన మధ్య లేరంటూ పోస్టులు పెడుతున్నారు. నిజమేనని నమ్మిన చాలా మంది వాటిని షేర్ చేస్తూ వస్తున్నారు.
నిజ నిర్ధారణ :
సన్నీ డియోల్ మరణం గురించి మీడియా నివేదికలను NewsMeter బృందం తనిఖీ చేసింది. అందుకు సంబంధించి కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది, కానీ ఆయన మరణించినట్లు ఎటువంటి కథనాన్నీ కనుగొనలేకపోయాము.
సన్నీ డియోల్ అధికారిక ట్విట్టర్ పేజీలో కూడా వెతకగా.. ఆయన తన రాబోయే సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఆగస్ట్ 25న సినీ డియోల్ నటించిన 'చుప్' సినిమా కూడా విడుదల అవుతోంది. ఆయన బ్రతికే ఉన్నారు. ఇలాంటి వదంతులను నమ్మకండి.
ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ Bollywood MDB.com ప్రకారం, సన్నీ డియోల్ రెండు సినిమాలు – గదర్ 2, చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ సినిమాలు 2022లో విడుదల కానున్నాయి. deadorkicking.com అనే వెబ్‌సైట్ కూడా నటుడు బతికే ఉన్నాడని స్పష్టం చేసింది. 65 సంవత్సరాల సన్నీ డియోల్ బతికే ఉన్నారు.. దయచేసి పుకార్లను పట్టించుకోకండని పేర్కొంది.
వెన్ను నొప్పి కారణంగా చికిత్స కోసం సన్నీ డియోల్ జులైలో యుఎస్ వెళ్లినప్పుడు ఈ పుకార్లు మొదలయ్యాయి.
నటుడు సన్నీ డియోల్ చనిపోయారనే వాదనలో ఎటువంటి నిజం లేదు. ఆయన బతికే ఉన్నారు.