Fact Check : ఓడిపోయామని తెలిశాక ఆర్జేడీ నేతలు స్వీట్స్ ను పారబోశారా..!

RJD workers did not dump sweets. బీహార్ ఎన్నికల్లో మరోసారి ఎన్డీయేనే అధికారం కైవసం చేసుకుంది. విజయం తమదేనని భావించిన

By Medi Samrat  Published on  16 Nov 2020 2:56 PM IST
Fact Check : ఓడిపోయామని తెలిశాక ఆర్జేడీ నేతలు స్వీట్స్ ను పారబోశారా..!

బీహార్ ఎన్నికల్లో మరోసారి ఎన్డీయేనే అధికారం కైవసం చేసుకుంది. విజయం తమదేనని భావించిన ఆర్జేడీ నేతలు ముందుగానే స్వీట్స్ తెచ్చిపెట్టుకున్నారట.. ఎప్పుడైతే ఓడిపోయామని గ్రహించారో.. అప్పుడు వాటిని పారబోసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.



"After loosing battle of ballots in Bihar, RJD workers decided to dump 1000s of 'Rasgulle'. Wish they had served them to the poor instead. It's so important to be educated. #TejashwiYadav (sic)." అంటూ ఆర్జేడీ వర్కర్లు కొన్ని వేల రసగుల్లా స్వీట్స్ ను కింద పడేశారని.. అవి పేదలకు పంచవచ్చు కదా అంటూ ప్రచారం కూడా కొనసాగుతూ ఉంది. గుంత త్రవ్వి.. అందులోకి ఓ పాత్రలో ఉన్న రసగుల్లాలను పారబోస్తున్న ఫోటోను గమనించవచ్చు.



స్వీట్స్ ను కింద పడేసిన మరికొన్ని ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


बड़े हरजाई हैं मोदी जी रसगुल्ले भी खुलकर नही फेकने दे रहे विरोधियों के बिहार चुनाव में हार के बाद महागठबंधन वाले रसगुल्ला को फेंकते हुए! 😂😂

Posted by Niraj Kumar Pandit Prajapati on Wednesday, 11 November 2020



నిజ నిర్ధారణ:

స్వీట్స్ ను కింద పారబోస్తున్నారంటూ బీహార్ ఎన్నికలకు సంబంధించినవంటూ జరుగుతున్న ప్రచారంలో 'ఎటువంటి నిజం లేదు'. వైరల్ అవుతున్న ఫోటోల్లో ఒకటి సంవత్సరం క్రితంకు చెందినది. మధ్యప్రదేశ్ కు చెందినది ఒకటి కాగా.. ఇంకొకటి హర్యానాకు చెందినది.





మొదటి ఫోటో:





న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా నవంబర్ 10, 2020న అమర్ ఉజాలా సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో చూడొచ్చు. ముఖ్యమంత్రికి సంబంధించిన ఫ్లైయింగ్ స్క్వాడ్, ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు రాధే రసగుల్లా ప్లాంట్ మీద రైడ్లు నిర్వహించారు. వాటిలో చాలా వరకూ చెడిపోయాయని.. ఈగలు వాలినవని తెలియడంతో వాటిని అధికారులు పారబోయమని చెప్పారు. దాదాపు ఒక క్వింటాల్ బరువు ఈ స్వీట్స్ ఉన్నాయి. హర్యానా రాష్ట్రం లోని సిర్సాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ముఖ్యమంత్రికి చెందిన ఫ్లైయింగ్ స్క్వాడ్ కొన్ని వందల కిలోల స్వీట్స్ ను పారబోసిందంటూ కథనాలు పలు మీడియా సంస్థల్లో వచ్చాయి.

రెండవ ఫోటో:





ఈ ఫోటోను న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అదే ఫోటోను ఆగష్టు 17, 2019న 'పత్రిక' సంస్థ పబ్లిష్ చేయడాన్ని గమనించవచ్చు. మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని గ్వాలియర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. జోధ్ పూర్ మిష్తాన్ భండార్ లో చెడిపోయిన స్వీట్లను, పాడైపోయిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. వాటిని పారేయమని అధికారులు సూచించారు.





Bhopal Samachar, News 18 Hindi కూడా ఈ ఘటనకు సంబంధించిన సమాచారం చూడొచ్చు.

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న ఫోటోలకు ఇటీవల బీహార్ ఎన్నికల ఫలితాలకు ఎటువంటి సంబంధం లేదు. చెడిపోయిన స్వీట్స్ ను అధికారులు పారబోయిస్తున్న ఫోటోలు ఇవి. ఓడిపోయామని తెలిశాక ఆర్జేడీ నేతలు స్వీట్స్ ను పారబోశారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Next Story