పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డూప్ లో ఉండే ఓ వ్యక్తి ఉన్న సినిమా పోస్టర్‌తో పాటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసిన స్క్రీన్ షాట్ వాట్సాప్‌లో వైరల్ అవుతుంది. ట్వీట్‌లో ఆర్జీవీ తన కొత్త ప్రాజెక్ట్, "ముప్పావలా" సినిమాను తీయబోతున్నామని చెబుతున్నట్లుగా ఉంది.
ట్వీట్‌లో RGV సినిమా పోస్టర్‌ను షేర్ చేసి, "ఈ సందర్భంగా నేను కొత్త సంబంధాల గురించి నా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాలనుకుంటున్నాను" అని రాసినట్లుగా ఉంది.
ఆ ట్వీట్ లో ఏమీ నేరుగా ఏమీ చెప్పనప్పటికీ.. పోస్టర్ లో జనసేన పార్టీ నాయకుడు, టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దిగజార్చే వ్యంగ్య ప్రయత్నం లాగా కనిపిస్తుంది.
ఇది 2020 లో ట్విట్టర్ మరియు ఫేస్‌బుక్‌లో వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడాన్ని గమనించవచ్చు.
వైరల్ పోస్టుల్లో ఉన్న లింక్ లను ఓపెన్ చేయగా.. ఎటువంటి రెస్పాన్స్ లేని వెబ్సైట్లలోకి వెళ్లిపోవడాన్ని గమనించవచ్చు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమాను నేను తీయడం లేదు.. తాను ఎటువంటి ప్రకటన కూడా చేయలేదని స్పష్టం చేస్తూ గతంలో ఒక ట్వీట్ కూడా వేశారు.
To whomsoever concerned the below is a doctored/morphed image and nothing to do with me ..If anyone wishes they can check my tweet history pic.twitter.com/Bd9SfDVAlY
జనవరి 16, 2020 న రామ్ గోపాల్ వర్మ చేసిన ఒక ట్వీట్‌ను కనుగొన్నాము. ఆ ట్వీట్ లో ఆర్జీవీ వైరల్ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసారు. వైరల్ చిత్రం మార్ఫింగ్ చేయబడిందని స్పష్టం చేశారు. "దిగువ ఉన్న డాక్టరేటెడ్/మార్ఫింగ్ చేసిన ఇమేజ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు .. కావాలంటే నా ట్వీట్లను తనిఖీ చేయవచ్చు" అని ఆయన ట్వీట్ చేశారు.
అనేక వార్తా సంస్థలు ఈ వైరల్ ఫోటో నకిలీ అని చెప్పాయి. అలాగే ఆర్జీవీ యొక్క వివరణపై కథనాలను నివేదించాయి. ఈ సినిమా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యంగా ఉందని.. ఆయన అభిమానులు ఆర్జీవీని విమర్శించారు మరియు ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్‌పై దర్శకుడు స్పందిస్తూ, ఇమేజ్ మార్ఫింగ్ చేయబడిందని మరియు సినిమాతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.
కాబట్టి రామ్ గోపాల్ వర్మ 'ముప్పావలా' అనే సినిమాను తీయబోతున్నానని చేసిన ప్రకటనలో ఎటువంటి నిజం లేదు. వైరల్ ఫోటో మార్ఫింగ్ చేయబడినది.
Claim Review:రామ్ గోపాల్ వర్మ 'ముప్పావలా' అనే సినిమాను తీయబోతున్నానని చెప్పారా..?