మల్లికార్జున్ ఖర్గే కోటుతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ముక్కు తుడుచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదే వీడియోను గత నెలలో బీజేపీ కర్ణాటక యూనిట్ ట్విటర్‌లో షేర్ చేసింది. ఖర్గే వంటి సీనియర్ నాయకులతో గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో ఇదొక సాక్ష్యమని చెప్పారు. అదే ట్వీట్‌లో రాహుల్ గాంధీ ఖర్గేను "టిష్యూ పేపర్"గా ఉపయోగించారని కూడా ఆరోపించారు.
కర్ణాటక ఎన్నికలకు ముందు మరోసారి ఈ వీడియో వైరల్ గా మారింది.
నిజ నిర్ధారణ :
న్యూస్ మీటర్ బృందం ఈ వైరల్ పోస్టు ప్రజలను పక్కదోవ పట్టించేదిగా గుర్తించింది.
మేము కీవర్డ్ సెర్చ్ చేసాం. ANI చేసిన ట్వీట్‌ను కనుగొన్నాము. రాహుల్ గాంధీని ఉటంకిస్తూ, “నేను ఇప్పుడు నిన్ను తాకినట్లయితే, నేను మీ వీపుపై నా ముక్కు తుడుచుకుంటున్నాను అని వారు అంటారు. ఇదంతా నాన్సెన్స్. మీరు చూస్తున్నారా? నేను మీకు సహాయం చేస్తున్నానని అనుకుంటే, నేను మీ బట్టలకు నా ముక్కు తుడుచుకుంటున్నాను అని వారు అంటున్నారు." అని తెలిపింది.
ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ OpIndia ద్వారా మేము కనుగొన్నాము. “In an attempt to reply to the BJP, Congress’ social media in-charge Nitin Agarwal said that the Congress scion had invited Kharge to drop him at his house.” అంటూ కథనంలో ఉంది.
"పూర్తి క్లిప్ చూడండి, రాహుల్ గాంధీ ఖర్గే జీని తన ఇంటికి డ్రాప్ చేయమని ఆహ్వానించారు, 40% కమీషన్ తీసుకునే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడానికి ఏమీ లేకుండా పోయింది. యధావిధిగా మాపై తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించింది" అని కాంగ్రెస్ మీడియా ఇన్ ఛార్జ్ నితిన్ అగర్వాల్ పేర్కొన్నారు.
ది ట్రిబ్యూన్, టైమ్స్ నౌ వంటి అనేక ఇతర మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని నివేదించాయి.
మల్లికార్జున్ ఖర్గేకు సహాయం చేయడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నప్పుడు, మల్లికార్జున్ ఖర్గే కోటుపై తన ముక్కు తుడిచినట్లు కనిపించే విధంగా మొత్తం సన్నివేశాన్ని తారుమారు చేసి ఎడిట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది.