క్వీన్ ఎలిజబెత్ II ఒకసారి రాయల్ కోర్ట్ లోని వారి కోసం ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు చెందిన 80 ఆటోగ్రాఫ్ జెర్సీలను ప్రత్యేకంగా తెప్పించిందనే వాదనతో సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.
క్రిస్టియానో రొనాల్డో సంతకం చేసిన మొదటి షర్టును రిజర్వ్ చేయమని మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్‌ను క్వీన్ అభ్యర్థించినట్లు పేర్కొంటూ కూడా పలు పోస్ట్‌లు వైరల్ అవుతూ ఉన్నాయి.
నిజ నిర్ధారణ :
వైరల్ ట్వీట్ కు సంబంధించిన స్పోర్ట్స్ ఇన్నోవేషన్ సొసైటీ (SIS) అధికారిక పేజీని NewsMeter పరిశీలించింది. అందుకు సంబంధించిన ట్వీట్ కనుగొనబడలేదు. SIS సమాచారాన్ని ధృవీకరించలేకపోవడంతో పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత పోస్ట్‌ను తొలగించినట్లు నివేదించబడింది.
తాము తప్పుడు సమాచారం అందించామని స్పోర్ట్స్ ఇన్నోవేషన్ సొసైటీ ట్వీట్ చేసిన లేఖను మేము కనుగొన్నాము "We could not confirm the veracity of the note from the Queen and CR7 so we decided to delete the tweet. Apologies." అంటూ ఇందులో ఎటువంటి నిజం ఉందో తెలుసుకోలేకపోయామంటూ పోస్టు పెట్టడం గమనించవచ్చు.
దీని ఆధారంగా.. SIS పొరపాటున నకిలీ వార్తలను అప్‌లోడ్ చేసి, ఆపై క్షమాపణలు చెప్పిందని మేము నిర్ధారించాము.
SIS క్షమాపణలు చెప్పినా ఈ పుకారుకు సంబంధించిన ప్రచారం ఆగలేదు. మీడియా సంస్థలు SIS యొక్క పాత ట్వీట్‌ను ఉటంకిస్తూ నిజమైన కథనంగా షేర్ చేయడం ప్రారంభించాయి. ఏ ఇతర విశ్వసనీయ మూలం ఈ వార్తలను ధృవీకరించలేదు. SIS పోస్ట్‌ను తొలగించే సమయానికి, పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే దీనికి ఇప్పటికే 10,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. వారు దానిని తొలగించే సమయానికి చాలా ఆలస్యం అయింది. ప్రజలు ఈ పుకార్లను నమ్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
క్వీన్‌పై ఇదొక నిరాధారమైన పుకారు అని భావించవచ్చు. కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.