రష్యాలో ఖురాన్‌ను తగులబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి షరియా చట్టం ప్రకారం మరణశిక్ష విధించబడుతుందని కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెబుతూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం చేసిన పరిశోధనలో, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదని గుర్తించింది. మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. జూన్ 13 నుండి రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ TASS కు సంబంధించి ఒక నివేదికను చూశాము. ఆ నివేదిక ప్రకారం ప్రకారం, ఖురాన్ దహనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను చెచెన్యా పరిశోధకులు దర్యాప్తు చేస్తారని పుతిన్ చెప్పారు.
అలాంటి తప్పులు చేసిన వ్యక్తులను శిక్ష అనుభవించడానికి నిందితులను రష్యాలోని మెజారిటీ ముస్లిం ఉన్న రిపబ్లిక్ చెచెన్యాకు పంపుతామని కూడా ఆయన హెచ్చరించారు. వోల్గోగ్రాడ్‌లోని కేథడ్రల్ మసీదు వెలుపల ఖురాన్‌ను కాల్చివేసినందుకు 19 ఏళ్ల యువకుడు నికితా జురావెల్ పై రష్యా చర్యలకు దిగింది. వోల్గోగ్రాడ్ రీజియన్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనపై క్రిమినల్ కేసు వేసి.. విచారణకు ఆదేశించింది. చెచెన్ రిపబ్లిక్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేసింది. అయితే ఈ నివేదికలో అతడికి మరణశిక్ష విధించే ప్రస్తావన లేదని స్పష్టంగా తెలుస్తోంది.
అదే విధంగా.. జూన్ 14న మిడిల్ ఈస్ట్ మానిటర్ ఒక మసీదు ముందు ఖురాన్ కాపీని తగులబెట్టిన నికితా జురావెల్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత పుతిన్ ప్రకటన వచ్చిందని నివేదించింది.
ది మాస్కో టైమ్స్ ప్రకారం, జురావెల్ కేసును చెచెన్ పరిశోధకులకు బదిలీ చేయాలనే నిర్ణయం గురించి న్యాయవాదులు భయపడుతున్నారు. ఎందుకంటే వారు అతనిని హింసించడమో లేదా చంపడమో చేసే ప్రమాదం ఉంది. రంజాన్ కదిరోవ్ పాలనలో ఉన్న చెచెన్యాలో మానవ హక్కుల ఉల్లంఘనకు సుదీర్ఘ చరిత్ర ఉంది.
రష్యాలో మరణ శిక్షలు ఉన్నాయా?
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ది స్పెక్టేటర్ ప్రకారం 1996 నుండి రష్యాలో ఉరిశిక్షపై తాత్కాలిక నిషేధం ఉంది.
అయితే ఇటీవల ఉరిశిక్షను మళ్లీ అమలు చేయాలనే డిమాండ్ వచ్చింది. డిసెంబర్ 2022 యొక్క TASS నివేదిక ప్రకారం, పుతిన్ ఉరిశిక్షను పునరుద్ధరించడాన్ని వ్యతిరేకించారు. మరణశిక్షను పునరుద్ధరించాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందని పుతిన్ అన్నారు.
రష్యాలో ఖురాన్‌ను తగులబెట్టిన నిందితులకు పుతిన్ మరణశిక్షను విధిస్తున్నట్లు ప్రకటించారనే వాదనలో ఎటువంటి నిజం లేదని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam