భారత ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు రాసిన లెటర్ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. బీహార్ ముఖ్యమంత్రిగా యూనియన్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ ను నియమించాలని ఆ లేఖలో మోదీ కోరినట్లు ఉంది. నవంబర్ 5, 2020న ఈ లేఖ రాసినట్లుగా ఉంది.
ట్విట్టర్ లోనూ, వాట్సప్ లోనూ ఈ లెటర్ వైరల్ అవుతోంది. బీహార్ లో ఎన్నికల ఫలితాలు రాకముందే భారత ప్రధాని నరేంద్ర మోదీ గిరిరాజ్ సింగ్ ను ముఖ్యమంత్రి చేయాలని కోరారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న లెటర్ 'ఫేక్' అని స్పష్టంగా తెలుస్తోంది. గిరిరాజ్ సింగ్ కు మద్దతు తెలుపుతూ నరేంద్ర మోదీ ఎప్పుడూ బీజేపీ చీఫ్ కు లెటర్ రాయలేదు. గిరిరాజ్ సింగ్ ను బీహార్ ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరలేదు.
వైరల్ అవుతున్న లెటర్ ను పరిశీలించగా.. ఆ లెటర్ లో ఎన్నో వ్యాకరణ దోషాలు ఉన్నాయి. చాలా పదాలను ఒక చోట వాడాల్సినవి మరో చోట రాశారు. అధికారిక లేఖకు ఈ లేఖకు ఎటువంటి పోలిక కనిపించలేదు. అధికారిక లేఖలో ఇలాంటి తప్పులు సాధ్యమైనంత వరకూ కనిపించవు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ మహేంద్ర సింగ్ ధోనీకి రాసిన అధికారిక లెటర్ కు.. వైరల్ అవుతున్న లెటర్ ను పోల్చి చూడగా చాలా వైవిధ్యంగా ఉన్నాయి. ఒరిజినల్ లెటర్ లో డేట్ లైన్ ను హిందీలో కూడా రాయగా.. వైరల్ లెటర్ లో కేవలం ఆంగ్లంలో మాత్రమే ఉంది.
నరేంద్ర మోదీ సంతకంలో కూడా ఇంతకు ముందు రాసిన అధికారిక లెటర్లకు, వైరల్ అవుతున్న లెటర్ కు మధ్య తేడాను గమనించవచ్చు.
ఈ తేడాలు మాత్రమే కాకుండా లెటర్ కు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన కానీ.. వార్తా కథనాలు కానీ మీడియాలో రాలేదు.
గిరిరాజ్ సింగ్ ను ముఖ్యమంత్రి చేయాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లెటర్ అంటూ వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'.