ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ కాంగ్రెస్‌లో చేరినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఓ క్లారిటీ లేని వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. మోదీ భార్య కాంగ్రెస్ లో చేరారు అంటూ పోస్టులు పెట్టడం గమనించవచ్చు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
కియాన్ మందిర్ కమిటీ 50వ వార్షికోత్సవం సందర్భంగా రాజస్థాన్‌లో జరిగిన కార్యక్రమంలో జశోదాబెన్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. జనవరి 2017న యూట్యూబ్‌లో అప్లోడ్ చేయబడిన ఒక వీడియోను కనుగొన్నాము. ఈ వీడియోను రాజస్థాన్ పత్రిక అప్‌లోడ్ చేసింది. వైరల్ క్లిప్పింగ్ 1:42 నిమిషాల మార్క్ చుట్టూ చూడవచ్చు. కోటాలో ఉన్న కియాన్ మందిర్ పాఠశాలలో జరిగిన వేడుకలో కొత్తగా నిర్మించిన హాస్టల్‌కు జశోదాబెన్ భూమిపూజ చేశారు.
FWP India News కూడా అలాంటి వీడియోను ఆగష్టు 2017న అప్లోడ్ చేసింది.
2017లో ప్రచురించబడిన టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జశోదాబెన్ పోటీ చేయాలని కాంగ్రెస్ కోరింది, కానీ అందుకు ఆమె నిరాకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు చర్యకు ఆమె కూడా మద్దతు పలికారు.
ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ కాంగ్రెస్‌లో చేరారనే ప్రచారం అవాస్తవం. వైరల్ వీడియో 2017లో ఓ స్కూల్ ఈవెంట్ కు సంబంధించినది.