Fact Check : సచిన్ పైలట్ జేపీ నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీలోకి చేరారా..?

Picture of Congress leader Sachin Pilot. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో

By Medi Samrat  Published on  16 Dec 2020 8:30 AM IST
Fact Check : సచిన్ పైలట్ జేపీ నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీలోకి చేరారా..?

కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలోకి చేరుతున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.



"Congratulations join BJP #Sachin_pilot Join BJP" అంటూ పోస్టులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

న్యూస్ మీటర్ ఈ ఫోటోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వైరల్ అవుతున్న ఫోటోను ఫోటో షాప్ ద్వారా మార్ఫింగ్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఒరిజినల్ ఫోటోలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాజీ నేత జ్యోతిరాధిత్య సింధియా. 2020 మార్చి నెలలో సింధియా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సమయం లోనిది.

ఒరిజినల్ ఫోటో NEWS 18 గ్యాలరీలో మార్చి 2020న అప్లోడ్ చేయడాన్ని గమనించవచ్చు. "Accusing the Congress of living in denial mode on the day after resigning from Congress, Jyotiraditya Scindia joined the BJP in New Delhi. (Image: PTI)" అంటూ ఫోటోను అప్లోడ్ చేశారు.

NDTV, THE WIRE , INDIA TODAY మొదలైన సంస్థలు కూడా ఈ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాయి. "Jyotiraditya Scindia joined the BJP today after ending an 18-year-long stint in the Congress party, which faces an uphill battle to protect its government in Madhya Pradesh. Scindia was seen as a close aide of Rahul Gandhi's." అంటూ కథనాలను రాశారు. 18 సంవత్సరాల పాటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సింధియా బీజేపీలో చేరారని ఆ కథనాల్లో రాసుకుని వచ్చారు. రాహుల్ గాంధీకి ఎంతో సన్నిహితుడైన సింధియా కాంగ్రెస్ పార్టీని వీడడం పెద్ద సంచలనం అయింది.





వైరల్ ఫోటోలోను, ఒరిజినల్ ఫోటోలో ఉన్న బ్యాగ్రౌండ్, పూలు.. లాంటివన్నీ ఒకే విధంగా ఉండడాన్ని గమనించవచ్చు. వైరల్ అవుతున్న ఫోటోను ఫోటో షాప్ చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక సచిన్ పైలట్ భారతీయ జనతా పార్టీలో చేరారు అన్నట్లుగా ఎటువంటి వార్తా కథనాలు కూడా లేవు. ఇది ఒక మార్ఫింగ్ చేసిన ఫోటో అని స్పష్టంగా తెలుస్తోంది.

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్నట్లుగా సచిన్ పైలట్ భారతీయ జనతా పార్టీలో చేరారన్నది పచ్చి అబద్ధం.


Claim Review:సచిన్ పైలట్ జేపీ నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీలోకి చేరారా..?
Claimed By:Twitter Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story