కన్నడ సూపర్‌స్టార్ యశ్ సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయాన్ని సందర్శించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నటుడు అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించి ఆలయ నిర్మాణానికి 50 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చాడంటూ కథనాలను వైరల్ చేస్తూ ఉన్నారు.
"సౌత్ సూపర్ స్టార్ నటుడు యశ్ రామమందిరంలోని రాంలల్లాను సందర్శించారు. రామ మందిర నిర్మాణానికి 50 కోట్ల రూపాయలు ఇస్తానని ప్రకటించారు" అని ఫోటోను షేర్ చేసిన ఫేస్‌బుక్ వినియోగదారు రాశారు.
నిజ నిర్ధారణ :
యశ్ 50 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారనే వార్తను ధృవీకరించడానికి NewsMeter కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. రామమందిర నిర్మాణానికి 50 కోట్లు యశ్ ప్రకటించినట్లు మాకు ఎటువంటి నివేదికలు కనుగొనబడలేదు.
మేము వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించాము. 12 ఏప్రిల్ 2022న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో ఉపయోగించిన అదే చిత్రాన్ని కనుగొన్నాము. నటుడు తన చిత్రం 'KGF-2 విడుదలకు ముందు తిరుమల వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు నివేదించబడింది' అని ఉంది. ఈ కథనం వైరల్ ఫోటోలో చూసినట్లుగా అదే వేషధారణతో ఉన్న అనేక చిత్రాలను కనుగొన్నాము.
YouTubeలో NYT ఎంటర్‌టైన్‌మెంట్ అప్లోడ్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. యశ్ ఆలయాన్ని సందర్శించిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. వైరల్ ఫోటోలో కనిపించే విజువల్స్ వీడియోలో ఉన్నాయి.
మరింత ధృవీకరణ కోసం, మేము నటుడి సోషల్ మీడియా ఖాతాలను (ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) తనిఖీ చేసాము.. అయితే రామ మందిర నిర్మాణానికి విరాళం ఇస్తున్నట్లు ఎటువంటి అధికారిక ప్రకటన కనుగొనబడలేదు.
ఏప్రిల్‌లో KGF: చాప్టర్ 2 విడుదలకు ముందు నటుడి తిరుపతి పర్యటనకు సంబంధించిన ఫోటోలు ఇవి. ఇక రామ మందిర నిర్మాణానికి ఏ విధమైన విరాళానికి సంబంధించి యశ్ స్వయంగా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని తెలుస్తోంది.
యశ్ అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించి 50 కోట్ల రూపాయలు విరాళం ఇస్తానని వాగ్దానం చేశాడనే కథనాలు అబద్దం.. అవాస్తవం అని మేము ధృవీకరించాము.