Fact Check : 2021 హరిద్వార్ కుంభమేళాకు చెందిన ఫోటో అంటూ వైరల్..!

Photo of Sadhus Clad in Loincloths not related to 2021 maha kumbh mela. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని హరిద్వార్ లో కుంభమేళా నిర్వహిస్తూ

By Medi Samrat  Published on  19 April 2021 1:49 PM GMT
Fact Check : 2021 హరిద్వార్ కుంభమేళాకు చెందిన ఫోటో అంటూ వైరల్..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని హరిద్వార్ లో కుంభమేళా నిర్వహిస్తూ ఉన్నారు. పలువురు కరోనా బారినపడడంతో కుంభమేళాపై సందిగ్ధత నెలకొంది. హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాను ముగిస్తున్నామని, మిగతా రోజుల్లో భక్తులు లేకుండా నామమాత్రంగా వేడుక జరుగుతుందని స్వామి అవధేశానంద గిరి వెల్లడించారు.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 28 వరకు 172 మందికి మాత్రమే కరోనా సోకినట్లు గుర్తించారు. ఈ సంఖ్య ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ 15 రోజుల్లో రాష్ట్రంలో 15,333 మందిని కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. కరోనా సంక్రమణను పరిగణనలోకి తీసుకుని మహా కుంభ్‌మేళాను నేటితో మూసివేస్తున్నట్లు నిరంజన్, ఆనంద్‌ అఖాడాలు ప్రకటించారు. కుంభ్‌ రద్దు ప్రకటనపై ఒకవైపు బైరాగి సాధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, జగద్గురు శంకరాచార్యుల శిష్యుడైన స్వామి అవిముక్తేశ్వరానంద నిర్ణీతకాలం వరకు కుంభ్‌ కొనసాగుతుందని ప్రకటించారు.

ఇలాంటి సమయంలో ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అందులో కొందరు సాధువులు గోచీలతో పుణ్యస్నానాలు చేస్తూ ఉన్నారు. అయితే దీనిపై కొందరు సెటైరికల్ గా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. కుంభమేళాలో సాధువులు మాస్కులు వేసుకున్నారంటూ పలువురు పోస్టులు పెట్టారు.

"Meanwhile at the Haridwar kumbh mela... Foreigners apalled at how low we wear our masks. #HaridwarMahakumbh2021" అంటూ పోస్టులు పెట్టారు.

నటి సిమి గరేవాల్ కూడా ఈ ఫోటోను పోస్టు చేశారు.

"Who said nobody is masked?" అంటూ దర్శకుడు హన్షల్ మెహతా కూడా ట్వీట్ చేశారు.

నిజనిర్ధారణ:

వైరల్ అవుతున్న ఫోటోపై న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ ఫోటో ప్రస్తుతం కుంభమేళాకు సంబంధించినది కాదని స్పష్టంగా తెలిసింది. ఫిబ్రవరి 14, 2013న Remote Lands అనే వెబ్ సైట్ లో కూడా ఈ ఫోటోను 14 ఫిబ్రవరి 2013న పోస్టు చేశారు. అందులో కుంభమేళా గురించి రాసుకొచ్చారు.

ఈ ఫోటోను ఎవరు తీశారు అనే క్లారిటీ లేకపోయినప్పటికీ.. 2013 సంవత్సరం నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.

2021లోని కుంభమేళాకు సంబంధించిన సమాచారం గురించి సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ వెతకగా ఎక్కడ కూడా ఈ ఫోటో కనిపించలేదు. ఎవరూ ఈ ఫోటోకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వలేదు.

ప్రస్తుత కుంభమేళాలో చాలా మంది మాస్కులు లేకుండా కనిపించినప్పటికీ ఈ ఫోటో మాత్రం ఇప్పటి కుంభమేళాకు సంబంధించినది కాదు. 2013 సంవత్సరం నుండి ఈ ఫోటో వైరల్ అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటి కుంభమేళాకు సంబంధించిన ఫోటో అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.




Claim Review:2021 హరిద్వార్ కుంభమేళాకు చెందిన ఫోటో అంటూ వైరల్..!
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story