భారతదేశంలోనే రెండో అతి పెద్ద కోవిద్-19 కేర్ సెంటర్ ను ఇండోర్ లో ఆర్.ఎస్.ఎస్. సంస్థ ఏర్పాటు చేసిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
ఓ పెద్ద స్టేడియంను ఆ ఫోటోలో చూడవచ్చు. 45 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారని.. అందులో 6000కు పైగా బెడ్స్ ఉండడమే కాకుండా నాలుగు ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయని ఓ ఫోటో వైరల్ అవుతోంది.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది ఖతర్ లోని అల్ బయత్ స్టేడియం. వైరల్ అవుతున్న పోస్టులు నిజం కాదని స్పష్టంగా అర్థమవుతోంది.
వైరల్ అవుతున్న ఫోటోను న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పలు మీడియా సంస్థలు ఇందుకు సంబంధించిన కథనాలను ప్రచురించాయి. "Al Bayt Stadium comes to life" అంటూ అల్ బయత్ స్టేడియం గురించిన వివరాలను వెల్లడించారు. దీన్ని బట్టి ఖతర్ లోని అల్ బయత్ స్టేడియం ఫోటోను వైరల్ ఫోటోలో వాడారని స్పష్టమవుతోంది.
వైరల్ ఫోటోలో ఉన్న సమాచారాన్ని బట్టి.. ఇండోర్ లో దేశంలోనే రెండో అతి పెద్ద కోవిద్-19 కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారని స్పష్టమవుతోంది. 6200 బెడ్స్ తో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 600 బెడ్స్ నుండి 6200 బెడ్స్ వరకూ ఈ కోవిద్-19 కేర్ సెంటర్ లో బెడ్స్ ను పెంచవచ్చు. కరోనా లక్షణాలు లేని వారిని ఇక్కడ ఉంచాలని అధికారులు నిర్ణయించారు. రాధాస్వామి సత్సంగ్ భవన్ కు చెందిన 45 ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు.
కరోనా లక్షణాలు పెద్దగా కనిపించకుండా ఉన్న వారిని ఇక్కడ ఉంచనున్నారు. కొన్ని బెడ్స్ కు ఆక్సిజన్ సదుపాయాన్ని కూడా ఉంచారు. ఈ కోవిద్-19 కేర్ సెంటర్ లో ఉన్న వారి ఆరోగ్యం కుదుటపడకపోతే దగ్గరలోనే ఉన్న ఆసుపత్రికి తరలించనున్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఖ్ ఈ కోవిద్-19 కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసిందని.. ఏ మీడియా సంస్థ కూడా చెప్పలేదు.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది ఖతర్ లోని అల్ బయత్ స్టేడియం.