Fact Check : రైతులకు మద్దతుగా మాయావతి గవర్నర్ ను కలిశారా..?

Photo of Mayawati with UP Governor from 2019. బి.ఎస్.పి. అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ను

By Medi Samrat  Published on  18 Dec 2020 3:43 AM GMT
Fact Check : రైతులకు మద్దతుగా మాయావతి గవర్నర్ ను కలిశారా..?

బి.ఎస్.పి. అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ను కలిసినట్లుగా ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. రైతుల డిమాండ్ లను ప్రభుత్వం ఒప్పుకోవాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారని ఆ పోస్టుల్లో ఉంది.





పలు సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోను వైరల్ చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

మాయావతి ఆనందిబెన్ పటేల్ ను కలిసి రైతుల డిమాండ్లకు మద్దతు తెలిపిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. ఈ వైరల్ ఫోటో 2019 సంవత్సరానికి చెందినది.

న్యూస్ మీటర్ ఈ ఫోటోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోకు సంబంధించిన కథనం 2019 డిసెంబర్ నెలలో Hindustan Times లో వచ్చింది. ప్రస్తుతం రైతులు ఆందోళనలు చేస్తున్న బిల్లులు సెప్టెంబర్ 2020న ప్రవేశపెట్టారు. కాబట్టి ఆ ఫోటోకు ఇప్పటి రైతుల ఆందోళనలకు ఎటువంటి సంబంధం లేదు.

Hindustan Times లో "BSP chief and former chief minister Mayawati met UP governor Anandiben Patel and urged her to talk firmly to the Adityanath government over rising crime against women in the state." అంటూ కథనాలు వచ్చాయి. ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మహిళల మీద చోటు చేసుకుంటున్న దారుణాలకు వ్యతిరేకంగా చర్యలను తీసుకోవాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ను కలిశారు.



ఏఎన్ఐ లో కూడా ఇదే ఫోటోను 2019 లో ట్వీట్ చేసింది. "Lucknow: Bahujan Samaj Party (BSP) Chief Mayawati met Uttar Pradesh Governor Anandiben Patel in Raj Bhavan today, over cases of crime against women." అంటూ ఫోటోలను అప్లోడ్ చేయడం జరిగింది.

News Nation TV, Patrika వంటి మీడియా సంస్థలు కూడా డిసెంబర్ 2019న ఈ భేటీకి సంబంధించిన కథనాలు వచ్చాయి. ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఆడవాళ్ళ మీద ఎన్నో దారుణాలు దుర్మార్గాలు చోటు చేసుకుంటూ ఉన్నాయని మాయావతి ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం మేలుకోవాలని వీటిని అరికట్టాలని కోరారు.

ఈ రిపోర్టుల ఆధారంగా మాయావతి ఆనందిబెన్ పటేల్ ను కలిసి రైతుల డిమాండ్లకు మద్దతు తెలిపిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది.


Claim Review:రైతులకు మద్దతుగా మాయావతి గవర్నర్ ను కలిశారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:False
Next Story