FactCheck : గాయపడిన ఆఫ్ఘన్ కార్యకర్త ఫోటోను పాక్ కు చెందిన మహిళగా ప్రచారం

Photo of injured Afghan activist passed off as domestic violence victim from Pak. ముఖంపై నుండి రక్తం కారుతున్న మహిళకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Feb 2023 2:45 PM GMT
FactCheck : గాయపడిన ఆఫ్ఘన్ కార్యకర్త ఫోటోను పాక్ కు చెందిన మహిళగా ప్రచారం

ముఖంపై నుండి రక్తం కారుతున్న మహిళకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పాకిస్తాన్‌లో మహిళల దుస్థితిని చూపుతుందనే వాదనతో షేర్ చేస్తూ ఉన్నారు. మహిళ వండిన ఆహారం నచ్చకపోవడంతో ఆమెపై భర్త దాడికి పాల్పడ్డాడని ఫోటోను షేర్ చేస్తున్న నెటిజన్లు పేర్కొంటున్నారు.



ఒక ట్విటర్ యూజర్ ఫోటోను షేర్ చేసి, “#పాకిస్తాన్‌లో మహిళల భయంకరమైన స్థితి, లాహోర్‌లో ఒక భర్త ఆమె వండిన ఆహారం నచ్చలేదనే కారణంతో భార్యపై దాడి చేశాడు.” అని ఉంది.

పలువురు సోషల్ మీడియా యూజర్లు ఈ ఫోటోను పోస్టు చేసి ఇది పాకిస్థాన్ లో జరిగిన ఘటన అంటూ చెప్పుకొస్తున్నారు.

నిజ నిర్ధారణ ;

ఫోటోలో రక్తస్రావం అవుతున్న మహిళ ఆఫ్ఘన్ మహిళా హక్కుల కార్యకర్త నర్గీస్ సదత్ అని న్యూస్ మీటర్ కనుగొంది.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తున్నప్పుడు, ఫోటోలో కనిపించే సారూప్య దృశ్యాలను చూపుతున్న వీడియోను మేము కనుగొన్నాము. ఈ వీడియోను మాజీ బీబీసీ ఫాస్టో జర్నలిస్ట్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి కబీర్ హక్మల్ ట్వీట్ చేశారు.

కాబూల్‌లో ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహిళలు చేస్తున్న నిరసన కార్యక్రమంలో మహిళా హక్కుల కార్యకర్త నర్గీస్ సదత్‌ను తాలిబాన్లు కొట్టారని ట్వీట్‌లో పేర్కొన్నారు.

2021లో CBS న్యూస్ ప్రచురించిన కథనంలో కూడా మేము ఆమె ఫోటోను కనుగొన్నాము. తాలిబాన్లు ఆఫ్ఘన్ మహిళలపై చేస్తున్న దాడులు అంటూ కథనాలను పోస్టు చేశారు.

ఫోటో కింద డిస్క్రిప్షన్ లో “An image from a video sent to CBS News by Afghan women’s rights activist Nargis Sadat shows her bleeding from her head after Taliban members attacked her during a protest in Kabul in September 2021.” అని ఉంది.

2021 NDTV నివేదికలో నర్గీస్ సదత్ చిత్రం కూడా ఉంది. మహిళా హక్కుల కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిన నిరసనను తాలిబన్లు అడ్డుకున్నారని.. తనను కొట్టారని కార్యకర్త నర్గీస్ సాదత్ ఆరోపించారని పేర్కొంది.

వైరల్ ఫోటోలో ఉన్నది ఆఫ్ఘన్ ఉద్యమకారిణి నర్గీస్ సదత్‌ అని స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ గృహ హింస బాధితురాలు కాదని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి వైరల్ అవుతున్న దావా తప్పు అని మేము నిర్ధారించాము.





























































































































































































































































































































































































































































































































































Next Story