సోషల్ మీడియాలో ఓ జంటకు సంబంధించిన ప్రైవేట్ వీడియో లీక్ అయింది. వైరల్ ఫుటేజ్‌లో ఒక పురుషుడు, స్త్రీ కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
నెటిజన్లు ఆ వ్యక్తిని బీజేపీ ఎంపీ దేవ్‌జీ పటేల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నేత దేవ్‌జీ పటేల్ రాజస్థాన్‌లోని జలోర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడుగా గెలుపొందాడు.
"రాజస్థాన్‌లోని బీజేపీ జలోర్ లోక్‌సభ నియోజకవర్గానికి దేవ్‌జీ పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది, నిరుద్యోగం పెరుగుతోంది. నాయకులేమో ఇలాంటి పనులు చేస్తున్నారు" అని క్యాప్షన్ పెట్టారు. ఒకమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఉండగా.. సదరు వ్యక్తి ఆమెపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.
నిజ నిర్ధారణ :
న్యూస్ మీటర్ బృందం వైరల్ వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది.
NewsMeter రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించింది మరియు పాకిస్తానీ వార్తా ఛానెల్ 'NaveedTv' ద్వారా అప్‌లోడ్ చేసిన అదే విజువల్స్‌ను 'ఖానేవాల్ డాక్టర్ జాఫర్ ఇక్బాల్ వీడియో స్కాండల్ విత్ ఎ గర్ల్' అనే టైటిల్‌తో కనుగొంది. ఈ వీడియో ఫిబ్రవరి 4, 2022న అప్‌లోడ్ చేయబడింది.
Dr.ZafarIqbal కంటి నిపుణుడు.. ఇలాంటి పనులు చాలా చేశాడని వీడియో పేర్కొంది.
డాక్టర్ పేరును క్లూగా తీసుకొని, మేము Googleలో కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. Facebookలో అనేక పోస్ట్‌లను కనుగొన్నాము. డ్యాన్స్ మాత్రమే కాకుండా సదరు పాకిస్తాన్ వైద్యుడిపై కొన్ని తీవ్రమైన ఆరోపణలను కూడా పోస్ట్ చేశారు.
ఫేస్‌బుక్ క్యాప్షన్ ఉర్దూలో ఇలా ఉంది.
ڈاکٹروںکایہحالہےتومریضوںکاخداحافظ
جنوبیپنجابکےمشہورڈاکٹرظفراقبالکیاپنےکلینکمیںخاتونکےساتھواہیاتویڈیولیک۔ اسیکلینکمیںپچھلےہفتے 16 سالہلڑکیکیموتہوئیتھی۔ویڈیواورتفصیلات
దక్షిణ పంజాబ్ కు చెందిన వైద్యుడు జాఫర్ ఇక్బాల్ తన క్లినిక్‌లో ఒక మహిళతో సెక్స్ చేస్తున్న వీడియో లీకైంది. అదే క్లినిక్‌లో 16 ఏళ్ల బాలిక కూడా మరణించిందని ఆరోపించారు.
బీజేపీ నాయకుడు దేవ్‌జీ పటేల్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు జలోర్ పోలీసుల అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక ట్వీట్‌ను మేము కనుగొన్నాము.
వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి పాకిస్థాన్‌కు చెందిన డాక్టర్ ఇక్బాల్ జాఫర్ కాదు బీజేపీ నేత దేవ్‌జీ పటేల్.
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.