#RIPImrankhan అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ అవ్వడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయారని ప్రజలు భావించారు. ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ పలువురు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. ఇస్లామాబాద్ లో జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్ లో ఇమ్రాన్ ఖాన్ మరణించారని కొందరు పోస్టులు పెట్టారు.
ఇమ్రాన్ ఖాన్ కు గాయాలైన ఫోటోలు, ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఫోటోలు ట్విట్టర్ లో వైరల్ అయ్యాయి.
Archive link:
https://perma.cc/W44Q-HZGX
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
బాంబు పేలుడులో ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుద్రోవ పట్టించేందుకు చేసినవే..! ఆగస్టు 17, 2021నుండి ఇమ్రాన్ ఖాన్ చనిపోయారనే పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
ఇమ్రాన్ ఖాన్ గాయపడినట్లు చూపిస్తున్న ఫోటోలు ఇప్పటివి కావు. 2013లో ఇమ్రాన్ ఖాన్ లాహోర్ లో ఎలెక్షన్స్ ర్యాలీని నిర్వహించిన సమయంలో వేదిక మీద నుండి పడిపోయిన సమయంలో చోటు చేసుకుంది.
https://www.bbc.com/news/av/world-asia-22441510
Euronews లో 2013 మే నెలలో వీడియోను అప్లోడ్ చేశారు.
పాకిస్తాన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన లాహోర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాకిస్థాన్ మూవ్‌మెంట్ ఫర్ జస్టిస్ పార్టీ (పిటిఐ) నాయకుడు ఇమ్రాన్ ఖాన్ గాయపడ్డాడు. అతని తల నుండి రక్తస్రావం అవ్వడంతో ప్రజలు, ఆయన అనుచరులు ఆసుపత్రికి తరలించారు.
ఇమ్రాన్ ఖాన్ ఐదుగురు వ్యక్తులతో కలిసి క్రేన్ ద్వారా ఎత్తుతున్న సమయంలో ఆరో వ్యక్తి పైకి ఎక్కడానికి ప్రయత్నించాడు. దీంతో అతడు బ్యాలెన్స్ కోల్పోయి పడిపోయాడని సాక్షులు చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ నేలపై పడడానికి ముందు లిఫ్టర్‌కు తగిలాడని మీడియా నివేదికలు తెలిపాయి.
ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడన్నది ఒక తప్పుడు వార్త అని పలు మీడియా సంస్థలు కూడా తెలిపాయి.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నారు. ఇటీవల చోటు చేసుకున్న బాంబ్ బ్లాస్ట్ లో ఆయన చనిపోయారని వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.