FactCheck : వైరల్ అవుతున్న వీడియో జాలోర్ లో చోటు చేసుకున్నది కాదు..!
Old video of teacher thrashing student falsely linked to Jalore Dalit boy death. గతంలో వైరల్ అయిన వీడియో ఇటీవల జాలోర్ సంఘటనగా షేర్ చేయబడుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Aug 2022 6:33 PM ISTగతంలో వైరల్ అయిన వీడియో ఇటీవల జాలోర్ సంఘటనగా షేర్ చేయబడుతోంది. ఓ వ్యక్తి చిన్నారిని కర్రతో కొట్టడం వీడియోలో కనిపిస్తుంది.
"मेराक्याकसूरथापानीयहतोपियाथा।मैंअबोध, क्याजानूक्याजाति, क्यापाती?
मेरेछूनेसेहोतामेलामटकाफोड़, तूदेता।मैंनेतोभगवानमानातूतोराक्षसनिकला।". అంటూ వీడియోను షేర్ చేస్తున్నారు.
"నా తప్పేంటి? నేను అమాయకుడిని. నేను ఏ కులం వాడినో నాకు తెలియదు." అని అందులో ఉంచారు.
రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాలలో తాగునీటి కుండను తాకినందుకు ఉపాధ్యాయుడు కొట్టిన కారణంగా తొమ్మిదేళ్ల దళిత బాలుడు ఆగస్టు 13న మరణించాడనే వార్తలు వచ్చాయి.
నిజ నిర్ధారణ :
NewsMeter రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి పాత వీడియోని కనుగొంది. ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో జూలై 6, 2022 తేదీల్లో జరిగింది. ట్యూషన్ సెంటర్‌లో పనిచేస్తున్న అమర్‌కాంత్ కుమార్ ఓ చిన్నారిని దారుణంగా కొట్టాడు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
మేము జూలై 7, 2022 నాటి ANI చేసిన ట్వీట్‌ను కనుగొన్నాము, అందులో "బీహార్: 6 సంవత్సరాల విద్యార్థిని దారుణంగా కొట్టినందుకు ట్యూషన్ టీచర్ అమర్‌కాంత్ కుమార్‌ని అరెస్టు చేశారు. విద్యార్థినితో మాట్లాడుతున్నట్లు చూసిన టీచర్ చిన్నారిని కొట్టాడు. ప్రత్యేక బృందం తీవ్రతను పరిగణనలోకి తీసుకకుంది: SSP పాట్నా"."Bihar: Tuition teacher Amarkant Kumar arrested for brutally thrashing 6y/o student. The teacher thrashed the child after he witnessed the teacher talking to a female student. A special team was constituted considering the matter's seriousness: SSP Patna". అనే ట్వీట్ ను మనం చూడవచ్చు.
Bihar: Tuition teacher Amarkant Kumar arrested for brutally thrashing 6y/o student
— ANI (@ANI) July 7, 2022
Teacher thrashed the child after he witnessed teacher talking to a female student.Special team was constituted considering matter's seriousness: SSP Patna
(Pic 1,2,3: Screengrab from viral video) pic.twitter.com/II0X832l2E
టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. "6 ఏళ్ల విద్యార్థిని దారుణంగా కొట్టినందుకు ట్యూషన్ టీచర్ అమర్‌కాంత్ కుమార్‌ని అరెస్టు చేశారు. విద్యార్థినితో మాట్లాడుతున్నట్లు గుర్తించిన ఉపాధ్యాయుడు ఆ చిన్నారిని కొట్టాడు."
జులై 20న ఇటీవల జరిగిన జాలోర్ దళిత బాలుడి మృతి కేసుకు సంబంధించి "రాజస్థాన్‌లోని సురానా గ్రామంలో దళితుడైన మైనర్ బాలుడిని ఉపాధ్యాయుడు కొట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. మంచి నీటి కుండను తాకినందుకు చిన్నారిపై ఉపాధ్యాయుడు దాడి చేశారని ఆరోపించారు."
जालौर के सायला थाना क्षेत्र में एक निजी स्कूल में शिक्षक द्वारा मारपीट के कारण छात्र की मृत्यु दुखद है। आरोपी शिक्षक के विरुद्ध हत्या व SC/ST एक्ट की धाराओं में प्रकरण पंजीबद्ध कर गिरफ्तारी की जा चुकी है।
— Ashok Gehlot (@ashokgehlot51) August 13, 2022
ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న ఘటనకు.. జాలోర్ ఘటనకు ఎటువంటి సంబంధం లేదు.