Fact Check : రైతుల ఆందోళనల్లో ఖలిస్థాన్ కు మద్దతుగా నినాదాలు చేశారా..?

Old video of Sikhs raising pro-Khalistan slogans. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా

By Medi Samrat  Published on  12 Dec 2020 10:57 AM IST
Fact Check : రైతుల ఆందోళనల్లో ఖలిస్థాన్ కు మద్దతుగా నినాదాలు చేశారా..?

కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే..! ఈ ధర్నాలకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.



కొందరు వ్యక్తులు చేతుల్లో మారణాయుధాలు పట్టుకుని ఉండగా.. ఖలిస్థాన్ కు మద్దతుగా నినాదాలు చేస్తూ ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పేరుకేమో రైతుల ధర్నా అని చెబుతూ ఉన్నారు. కానీ ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

న్యూస్ మీటర్ వైరల్ అవుతున్న వీడియోను పరిశీలించగా 2016కు సంబంధించిన వీడియో అని తేలింది. ప్రస్తుతం జరుగుతున్న రైతుల ధర్నాకు ఈ వీడియోకు ఎటువంటి సంబంధం లేదు.

2016 సంవత్సరంలో పంజాబ్ లోని బీస్ బ్రిడ్జి మీద ఈ ఘటన చోటు చేసుకుంది. శివ సేనకు వ్యతిరేకంగా సిక్కులు ఈ ధర్నాను చేపట్టారు.


రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియోను యూట్యూబ్ లో ఖల్సా ఘట్కా గ్రూప్ అప్లోడ్ చేసింది. మే 26, 2020న వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియో మే 2020 నుండి యూట్యూబ్ లో అందుబాటులో ఉండగా.. ప్రస్తుత రైతు ధర్నాకు ఈ వీడియోలో ఉన్న ఘటనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతోంది.

Hindustan Times, Times of India మీడియా సంస్థలు మే 2016 లోనే ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందించాయి. "Even as Hindu right-wing Shiv Sena had called off its Lalkar Rally about three days back, Sikh hardliners assembled at the proposed site—the Beas bridge—on the National Highway -1 on Wednesday to challenge them" అంటూ హిందుస్థాన్ టైమ్స్ లో అప్పటి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు.

అప్పటి వీడియోను ఇప్పటి రైతుల ధర్నాకు లింక్ చేస్తూ వీడియోలను వైరల్ చేస్తూ ఉన్నారు. 2016లో లల్కర్ ర్యాలీకి చెందిన వీడియో ఇది.

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review:రైతుల ఆందోళనల్లో ఖలిస్థాన్ కు మద్దతుగా నినాదాలు చేశారా..?
Claimed By:Twitter Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story